భూమికి పట్టిన మాస్కు
భూమికి పట్టిన మాస్కు


ఓ వుహాను పుర వాసినీ,
కరోనా మహమ్మారి,
సర్వ మానవ లోక భయంకరముగా,
విజృంభించి దేశముల వ్యాపించి,
మమ్ముల ఉక్కిరి బిక్కిరి చేయుచున్నావు,
మనిషికి మనిషి భయపడి బందీ అయినాడు,
ఎప్పుడు ఈ మహమ్మారి జబ్బు పోతుందో,
అని అనుకుంటూ భూమి తన మాస్కును సరి చేసుకుంది.
మిగతా గ్రహాలు ఎలా ఓదార్చాలో తెలీక బాధపడుతుంటే,
సానిటైజర్ని ఆకాశం వర్షంలా కురిపించింది.