బాలలం మేము....బావిభారత పౌరులం
బాలలం మేము....బావిభారత పౌరులం


ఆకాశానికి నిచ్చెనవేసి ఎక్కేస్తాం
భూగోళాన్ని బంతిగా చేసి ఆడిస్తాం.
లోకాలన్నీ తిరిగొచ్చి హాయిగా...
నిద్దురపోతూ రేపటి నవ్వుకి కల కంటాం.
గాలిపటాలకన్నా ముందుగా ఎగిరి
సూర్యకిరణాలను ముడివేస్తాం.
చేపకు ఈతలు నేర్పి వస్తాం
కోతిలు ముందు కుప్పిగెంతులు వేసిస్తాం
కాకిని అరుపుతో పిలిచేస్తాం
సెలయేటికీ చక్కని నడకలు చూపిస్తాం
సీతాకోకచిలుకలమైపోతాం
పూలమొక్కలను ప్రేమిస్తాం
ప్రకృతి వద్ద వికృతి చేష్టలు మానేస్తాం
నెమలితో పోటీగా నాట్యం చేస్తాం
హంసకు ఒయ్యారాన్ని చూపిస్తాం
పిట్టల దొరలా సరదా చేస్తాం
చీటికీ మాటికి జోకులు వేస్తూ
సరదా సందడి చేసేస్తాం
చాచా నెహ్రు మా నేస్తం
గులాబి రెమ్మల మాదిరిగా గుభాళించి
గుమ్మడి పువ్వులా వికసిస్తాం.
ఆడే పాడే పిల్లలం ఆంక్షలు పేరిట
సంకెళ్లు వెయ్యొద్దు అరెస్ట్ చేయొద్దు.
చదువున సంధ్యన ముందే ఉంటాం
ఆధునిక విద్యార్థులుగా పరిగెడతాం
తడబడకుండా ఉరికేస్తాం
ఊరూ వాడన మంచి తనంతో గెలిసోస్తాం
కులం మతం అడ్డుగోడలు మాకొద్దు
బాషా ప్రాంతీయ విభేదాలు అసలొద్దు
స్వచ్ఛభారతి బిడ్డలం మేం
కోకిల గొంతుతో పాడుకుంటూ....
విశాల విశ్వంలో భారత పునాది నిర్మిస్తాం
క్రాంతి పదాన కాంతి రేఖలు సృష్టిస్తాం.