అవకాశమా లేక అవరోధమా?
అవకాశమా లేక అవరోధమా?
బంధాలను కలిపింది బాధ్యతలను పెంచింది!!
ఆర్ధికం గా వెనుకబడేసింది
కుటుంబం తో కలిసి వుండే అవకాశం ఇచ్చింది!!
స్వదేశీ పద్ధతులకు స్వస్తి పలికింది
దేశ సంస్కృతి గొప్పదనం చాటి చెప్పింది!!
వ్యక్తిగత పరిశుభ్రత ని నేర్పింది
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నియమించింది!!
కుల మత జాతి బేధాలను చేదరగొట్టింది
మనమంతా మనుషులం అని మానవత్వం పరిమళించే ల చేసింది!!
ఎన్నో ఏళ్లుగా సెలవులు లేని
సీరియల్ వాళ్ళకి సెలవులు ఇచ్చింది
అవే చుసే వాళ్ళకి పిచ్చి పట్టేలా చేసింది!!
రోడ్లు వుడిచే వాళ్ళు అని చులకన చేసే వాళ్ళతో
నువ్వే మాకు రక్ష అంటూ వాళ్ళకి సలాం చేసేలా చేసింది!!
విదేశీ బ్రాండ్లు బ్యాన్ చేసింది
స్వదేశీ బ్రాండ్ల కి ఊపిరి పోసింది
ఆయుర్వేదానికి వున్న సత్తా చాటింది
మురికి చేతులతో తినే వారినీ సైతం
సానిటైజ్ వాడేలా చేసింది
వారానికి ఓ సారి స్నానం చేసే వాడితో
రెండు పూటలా స్నానం చేయించింది
అంతా బాగానే ఉంది కానీ
వలస కూలీలతో కుస్తీ లు పట్టించింది
నిరుపేదలను పస్తులు వుంచింది!!
డబ్బున్న వాడు బాగానే వున్నాడు
లేని వాడు మాత్రం కరోనా బారిన పడి చస్తున్నారు!!