ఆటలాడుదాం బ్రదరూ
ఆటలాడుదాం బ్రదరూ
1 min
190
క్యాండీ క్రష్ లెవెల్స్
పబ్ జీ పోటీలు
ఆన్ లైన్లో ఎన్నో గేమ్స్
కళ్లకు నొప్పులు తెప్పించేలా
చేతి వేళ్ళు అతుక్కు పోయేలా
అసలు ఏం జరుగుతోందో తెలీకుండా
స్మార్ట్ ఫోన్లో గేములు ఆడి
బోరు కొట్టిందా
ఫోను పక్కన పెట్టేసి
ఆన్ లైనుకు బ్రేకు ఇచ్చి
కాస్సేపు బయటికి వెళ్ళు
పచ్చని ప్రకృతి చూడు
పాత మిత్రుల్ని పోగు చేసేయి
పక్కింటి పిల్లలతో దోస్తీ చేసేయి
మన బాల్యపు స్మృతులను మరచిపోకుండా
కొంచెం ఆటలాడుదాం బ్రదరూ
ఫోనులో కాదు
ఆట స్థలంలో గంతులు వేద్దాం బ్రదరూ
