STORYMIRROR

Dinakar Reddy

Children Stories Fantasy Children

3  

Dinakar Reddy

Children Stories Fantasy Children

వండర్ ల్యాండ్లో వింత పోరు

వండర్ ల్యాండ్లో వింత పోరు

1 min
248

క్రిష్ ను టెలీపతీ ద్వారా కాంటాక్ట్ చేసింది అలీస్. 

అలీస్ ఎక్కడున్నావ్ క్రిష్ గొంతులో ఆదుర్దా.


ఏమో. నేనెక్కడున్నానో తెలియట్లేదు. ఇక్కడ మొత్తం చెట్లు పూల మొక్కలు ఉన్నాయి. నేను కుందేలును వెంబడిస్తూ దాని నివాసంలోకి దూరాను. అక్కడి నుంచి ఇలా వచ్చి చిక్కుకుపోయాను అని చెప్పింది అలీస్.


క్రిష్ కుందేలు నివాసానికి చేరుకుని తన పరిణామాన్ని తగ్గించుకుని లోపలికి వెళ్ళాడు. కానీ అతనికి అలీస్ కనిపించలేదు.


తానొక అగాధంలోకి పడిపోతున్నాను అని తెలుసుకొని అతను రెక్కలు సృష్టించుకుని పైకి ఎగరసాగాడు. కానీ ఎంత ఎగిరినా అతడికి వెలుతురు కనిపించట్లేదు.


క్రిష్ ఒక వైపుకు లాగబడ్డాడు. అక్కడ లార్డ్ వాల్డ్ మార్ట్ మనుషులు ఉన్నారు. 


ఎవరు మీరు అన్నాడు క్రిష్. అతనిప్పుడు ఎగరడం లేదు. బెల్లాట్రిక్స్ అతనికి అలీస్ ఎక్కడుందో చూపిస్తామని దానికి బదులుగా క్రిష్ ఒకరిని చంపాలని చెప్పింది.


మొదట అలీస్ కనిపించిన తరువాతే తను వాళ్ళకు సహకరిస్తానని క్రిష్ చెప్పడంతో బెల్లాట్రిక్స్ మిగిలిన వారితో కలిసి వారిని వండర్ ల్యాండులోని పార్కుకు తీసుకుని వెళుతుంది. 


అక్కడ అలీస్ ను కలుసుకున్న క్రిష్ ఇక బయట పడదాం అని అనుకుంటాడు.


అప్పుడే వాళ్ళకి బంధింపబడిన హ్యారీ పోటర్ కనిపిస్తాడు. బెల్లాట్రిక్స్ క్రిష్ మీద తన చీకటి శక్తుల్ని ప్రయోగిస్తుంది.


క్రిష్ కత్తి తీసుకుని హ్యారీ పోటర్ వైపు నడుస్తున్నాడు.


Rate this content
Log in