సాయి లీల
సాయి లీల
ఒకానొక గ్రామం లో ఓ చిన్న ఇంటిలో అమ్మ, నాన్న, ఓ అబ్బాయి వుంటున్నారు. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ ఎప్పుడు నీతి కధలు, దేవుడి కధలు చెపుతూనే పెంచేది. ఒకనాటి రాత్రి అ బాలుని కలలో ఓ తెల్లని దుస్తులు ధరించి ఒక బాబా కనిపించేరు, ఆ బాలుడు మీరెవరు ఇంత ముసలివారి వలె వున్నారు అని అడిగేడు. వెంటనే నా పేరు షిరిడీ సాయి అంటారు.. అని చెప్పారతను. వెంటనే ఆ బాలుడు అవును మా అమ్మ దినము మిమ్మలినే పూజిస్తుంది అని చెప్పేడు. మీరు నాకు ఓ సహాయం చేస్తారా అని ఆ బాలుడు అడిగేడు ఏమిటి కావాలి అని బాబా అడిగిన వెంటనే ఆ బాలుడు మా అమ్మ నాన్నలు చాలా కష్ట పడుతున్నారు వాళ్ళని నేను బాగా చూసుకొనే లా నన్ను ఆశీర్వదించండి అన్నాడు, బాబా తాదాస్తూ అని వెళ్లిపోయారు. బాలుడు చాలా సంతోషిస్తూ ఆడుతూ పాడుతు చదువుకొని కలెక్టర్ అయి తన తల్లితండ్రులను బాగా చూసుకో కోవటమే కాక పేదలకు సేవ చేస్తూ సాయి నే తలుచుకుంటూ కాలం గడుపుతున్నాడు మంచి కోరితే మంచే జరుగుతుంది.
