Dinakar Reddy

Children Stories Fantasy Children

4.0  

Dinakar Reddy

Children Stories Fantasy Children

నిధి కోసం భూకేంద్రకం వైపు

నిధి కోసం భూకేంద్రకం వైపు

2 mins
176


శక్తిమాన్ మమ్మల్ని భూమి లోపలికి తీసుకెళ్లగలవా? చంటబ్బాయ్ అడిగాడు.


కానీ ఎంత లోపలికి చంటబ్బాయ్? శక్తిమాన్ అడిగిన ప్రశ్నకి చంటబ్బాయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అడవిలో రకరకాల జంతువుల అరుపులు వింటున్నాడు.


వారితోనే నడుస్తున్న రామానుజం చంటబ్బాయ్ దగ్గర నుండి మ్యాప్ తీసుకున్నాడు. ఇందులో ఇచ్చిన గుర్తులను బట్టి పొడవూ వెడల్పులను జీటా ఫంక్షన్ సమీకరణాలలో వ్రాస్తే వచ్చే విలువ మనం ఎంత లోపలికి వెళితే భూమిలో నిధి దొరుకుతుందో ఇస్తుంది.


కానీ అంటూ అగాడు రామానుజం.


చెప్పండి రామానుజం. ఎందుకని ఆగిపోయారు అని అడిగాడు శక్తిమాన్.

చంటబ్బాయ్ మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మీరు చెప్పగలరు అని నాకు తెలుసు అని నవ్వాడు.


అది కాదు చంటబ్బాయ్. మనం భూమిలోకి వెళ్లాల్సిన దూరం స్థిరం కాదు. భూకేంద్రకం చుట్టూ మనం పరిభ్రమిస్తూ ఉండాలి. అలా ఉంటేనే భూకేంద్రకానికి పైన క్రిందా మరియు భూకేంద్రకం మధ్యలో ఒకేసారి సరళ రేఖలో మనం నిలబడినప్పుడు మనం నిధి ఉన్న చోటుని చూడగలుగుతాం అని వివరించి చెప్పాడు రామానుజం.


చంటబ్బాయ్ అడవిలో ఎండకు రామానుజం చెప్పిన లెక్కలోని విషయానికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అన్నాడు.


శక్తిమాన్ కంగారు పడొద్దు అని చెప్పి తాను పంచ భూతాల శక్తిగా ఐదుగురు శక్తిమాన్ రూపాలుగా మారాడు. భూమి శక్తిగా ఉన్న శక్తి మాన్ భూకేంద్రకాన్ని చేరాడు.


జల రూపంలోని శక్తి మాన్ నీటి ద్వారా చంటబ్బాయ్ తో సహా భూకేంద్రక ఊర్థ్వ భాగాన్ని చేరాడు. అగ్ని రూపంలోని శక్తి మాన్ రామానుజం తో సహా భూకేంద్రకం అధో భాగాన్ని చేరాడు.


వారు నిలుచున్న చోట నుండి నీడలు సరళ రేఖలో ఒకదానికొకటి తగలడంతో భూ కేంద్రానికి సమాంతరంగా మరో పొర ఏర్పడింది. అక్కడ కొన్ని వేల బారువుల బంగారు మరియు వజ్రాల నిధి కనిపించింది.


వాయు రూపంలోని శక్తి మాన్ ఆ నిధిని భూమి పై భాగానికి చేర్చాడు. ఆకాశ రూపంలోని శక్తి మాన్ అందరినీ బయటికి తీసుకు వచ్చాడు.


చంటబ్బాయ్ మ్యాప్ సంపాదించి తనను పిలిచినందుకు శక్తి మాన్ అతణ్ణి ప్రశంసించాడు. పిలవగానే శ్రమ అనుకోకుండా వచ్చినందుకు రామానుజాన్ని కూడా అభినందించి ఒకే రూపంలోకి మారాడు శక్తి మాన్.


ఈ నిధిని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుదాం అని నిర్ణయించుకున్నారు ఆ ముగ్గురూ.


అంతా నామగిరి తాయర్ మహిమ అంటూ రామానుజం మనసులోనే దేవికి నమస్కరించాడు.



Rate this content
Log in