STORYMIRROR

Dinakar Reddy

Children Stories Drama

4  

Dinakar Reddy

Children Stories Drama

నానమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది

నానమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది

1 min
76

ఎందుకని అందరూ నానమ్మ వెళ్ళిపోయింది అంటున్నారు.

నానమ్మ చాప మీదే పడుకొని ఉంది.ఆమె కళ్ళ కొసల దగ్గర బియ్యం ఉన్నాయి.తల దగ్గర దీపం వెలుగుతూ ఉంది.

అమ్మ,నాన్న,అత్తయ్య,పిన్ని,బాబాయ్ అందరూ ఏడుస్తున్నారు.

నానమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంట.దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అంట.

మిన్నీ తన బొమ్మను చేతిలో పట్టుకుని చెబుతూ ఉంది.మిన్నీ పసి తనపు అమాయకత్వాన్ని చూస్తూ ఉన్నాడు మిన్నీ వాళ్ళ అన్నయ్య రాము.

ఒక్కో సారి చిన్న పిల్లల్లా ఉండడం ఎంత బాగుంటుందో కదూ బాబాయ్ అని వాళ్ళ బాబాయ్ తో అన్నాడు.రాము వాళ్ళ నానమ్మకు అంత్య క్రియలు పూర్తి చేశాడు.

మిన్నీ తన బొమ్మకు నానమ్మ చెప్పిన కథలన్నీ చెబుతూ ఉంది.


Rate this content
Log in