STORYMIRROR

Dinakar Reddy

Children Stories Fantasy Children

3  

Dinakar Reddy

Children Stories Fantasy Children

మాహిష్మతీ నగరంలో మహా యుద్ధం

మాహిష్మతీ నగరంలో మహా యుద్ధం

1 min
154

అలెగ్జాండర్ మాహిష్మతి నగరం మీద దాడి చేయబోతున్నాడు అనే వార్త అందింది. 

కట్టప్పా. అన్ని రాజ్యాల్ని వదిలి ఆ అలెగ్జాండర్ మన మాహిష్మతి నగరం మీదకి ఎందుకు వస్తున్నాడు? అని అడిగింది శివగామి.


బాహుబలి భల్లాల దేవా బిజ్జలదేవుడు వారి వారి ఆసనాలపై కూర్చుని ఉన్నారు. 


తల్లీ. ఆ అలెగ్జాండర్ మనతో యుద్ధం చేసి మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీయాలని అనుకుంటున్నాడు.

పోరస్(పురుషోత్తముడు) కి మనం సహాయంగా ఉండడం వలన అతను మనల్ని మొదట జయించాలి అనుకుంటున్నాడు.


శివగామి చప్పున తన ఆసనంలోంచి లేచింది. బాహూ- భల్లా భరత ఖండంలోని రాజులందరికీ వర్తమానం పంపండి. అణు ఆయుధాలను నిర్వీర్యం చేయగలిగే సాధనాల్ని తయారు చేయండి. మనం ఈ యుద్ధాన్ని గెలవాలి. కేవలం మాహిష్మతి కోసం కాదు.

మూడో ప్రపంచ యుద్ధం ఆపడం కోసం అని తన నిర్ణయాన్ని చెప్పింది.


బాహుబలి భల్లాల దేవా ఇద్దరూ సరేనమ్మా అంటూ లేచారు.


ఇద్దరూ కలిసే పోరాడాలి అని ఓ సారి బిజ్జలదేవుడి వైపు తిరిగి చూసి ఆమె ఆ సమావేశం నుండి వెళ్ళిపోయింది.


బాహూ. బాహుబలి. ఎవరో తనను పిలుస్తున్న చప్పుడు కావడంతో అప్రమత్తమై ఖడ్గం తీసుకుని కిటికీ వైపు నడిచాడు. అక్కడ నీడను చూసి కత్తి దూసెంతలో 

అతని ఖడ్గం మాయమైంది.


హేయ్ మిత్రమా. ఆగు అంటూ హ్యారీ పోటర్ కనిపించాడు. హ్యారీ కూడా బాహుబలికి యుద్ధంలో సాయం చేస్తానని చెప్పాడు.


మూడో ప్రపంచ యుద్ధం ఆపడానికి సూపర్ హీరోలంతా బాహుబలి వైపు చీకటి శక్తులు అన్నీ అలెగ్జాండర్ వైపు చేరారు.


భయంకరమైన యుద్ధం మొదలు కాబోయే ముందు గ్రీకు దేవతలు మాహిష్మతి నగరాన్ని చేరారు.


Rate this content
Log in