Dinakar Reddy

Children Stories Comedy

4  

Dinakar Reddy

Children Stories Comedy

చందమామ కథలు

చందమామ కథలు

1 min
525


చింటూ నిద్ర లేచాడు. చుట్టూ ఏవో పుస్తకాలు. తను లేచి నిలబడ్డాడు. అవన్నీ కథల పుస్తకాలు. చందమామ, బాలమిత్ర ఇంకా బుజ్జాయి ఇలాంటి పుస్తకాలన్నీ గుట్టలు గుట్టలుగా తన చుట్టూ పడి ఉన్నాయి.

చింటూ ఒక చందమామ పుస్తకం తీసుకుని అందులో భేతాళ విక్రమార్క కథలు చదవసాగాడు.

ఎన్ని కథలు చదివినా ప్రతీ కథ చివర్లో విక్రమార్కుడికి మౌనభంగం కలగగానే భేతాళుడు చెట్టెక్కడం. మళ్లీ విక్రమార్కుడు భేతాళుని శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా నడవడం. ఇదే జరుగుతోంది. 

చింటూకి ఎలాగైనా సరే ఆ కథలకు ముగింపు కావాలని అన్ని కథల పుస్తకాలు తిరగేయసాగాడు.

అలా తిరగేస్తూ భేతాళ భేతాళ అని అరుస్తున్నాడు.


అంతలో చింటూ వాళ్ళ అమ్మ ఓ బక్కెట్టు నీళ్ళు చింటూ మీద పోసింది.

చింటూ నిద్ర లోంచి మేలుకుని భేతాళుడు ఎక్కడా అని అడిగాడు. 



Rate this content
Log in