STORYMIRROR

Dinakar Reddy

Children Stories Fantasy Children

3  

Dinakar Reddy

Children Stories Fantasy Children

బ్రదర్స్

బ్రదర్స్

1 min
255

నన్నందరూ పికె అంటున్నారు. టీవీ షోలో నేను మా గ్రహానికి వెళ్ళడానికి కావలసిన రిమోట్ అయితే దొరికింది. కానీ నా తమ్ముడు జాదూ ఎక్కడ?


వాణ్ణి వెతుక్కుంటూ వచ్చాను. నేనూ దారి తప్పాను. ఏదో ఆ రిపోర్టర్ పుణ్యమాని ఎలాగోలా రిమోట్ దొరికింది. పికె తనలో తనే బాధ పడుతున్నాడు.


జగ్గూ. నా తమ్ముడిని వెదికి పెట్టవూ అని అడిగాడు పికె . రిమోట్ వెతకడానికి కష్టపడ్డావ్. కానీ నీ తమ్ముడు జాదూ ను వెతకడం పెద్ద కష్టమేమీ కాదు అంది జగ్గూ.


సర్ఫరాజ్ ఇంకా జగ్గూ కలిసి జాదూ అనే ఏలియన్ తప్పిపోయింది అని ఫేస్బుక్ లో పోస్టు చేశారు. చాలా మంది ఏలియన్ ఉందనే నమ్మలేదు.


ఒక రోజు క్రిష్ ఆ పోస్టు చూశాడు. అతడు పికె ని కలిసి అతను నిజంగా ఏలియన్ అని నమ్మకం కుదుర్చుకున్నాడు.


పికె ఇంకా జాదూ కలుసుకున్నారు. ఇద్దరికీ భూమిని విడిచి వెళ్లాలని లేదు. కానీ జాదూని బంధించి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని తెలిసి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది అని అందరూ నిర్ణయిస్తారు.


పికె రిమోట్ తో వారి గ్రహానికి వెళ్లాల్సిన వాహనాన్ని పిలుస్తాడు. క్రిష్ కుటుంబం జాదూని హత్తుకుని వీడ్కోలు చెబుతుంది. పికె తన ప్రేమను జగ్గూకి చెప్పకుండా భారంగా వాహనంలోకి వెళ్ళిపోతాడు జాదూతో సహా. అందరూ టాటా చెబుతున్నారు.


ఆ వాహనం వారి గ్రహం వైపు వెళ్ళిపోయింది.


Rate this content
Log in