భేతాళ విక్రమార్క
భేతాళ విక్రమార్క
చెట్టు మీద నుండి భేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని తన భుజంపైన వేసుకుని మౌనంగా స్మశానం వైపు నడవసాగాడు విక్రమార్కుడు.
విక్రమార్కా! నీకు వినోదంగా ఉండడానికి ఒక కథ చెబుతాను అంటూ భేతాళుడు ఇలా చెప్పసాగాడు.
ఒక తెలివైన భిక్షువు రాజుకు రోజూ ఒక ఫలము ఇచ్చే వాడు. ఒక రోజు ఆ ఫలము నుండి రత్నము బయటపడగా ఆ భిక్షువు ఇచ్చిన అన్ని ఫలములు పరీక్షింప రత్నముల రాశులలో కోశాగారం నిండినది.
తదుపరి రాజు భిక్షువు ఫలము ఇచ్చు కారణము తెలిసికొనగా ఆ భిక్షువు మంత్ర సాధన కొరకు వీరుడైన మహారాజు సాయము అర్థించెను.
రాత్రి వేళ చెట్టుకు వేలాడుతన్న పురుష శవమును తనకు తెచ్చి ఇమ్మని కోరినాడు ఆ భిక్షువు.
అడగడమే చాలు అని ఆ రాజు శవమును భిక్షువు కు అప్పగించ సాగుతున్నాడు.
భేతాళుడు కథ చెబుతూ ఉన్నాడు. విక్రమార్కుడు మౌనంగా స్మశానం వైపు అడుగులు వేస్తున్నాడు.
అంతటి వీరుడు శూరుడు అయిన రాజు భిక్షువుకు రత్నము కలిగిన ఫలములు ఎక్కడివి అని కానీ రాత్రి వేళ స్మశానంలో మంత్ర సాధన చేయగోరిన భిక్షువు మంత్రము సిద్ధించిన రాజుకు రాజ్యముకు కీడు చేయగలడా అని కానీ రవ్వంత ఆలోచన కూడా రాలేదు.
విక్రమార్క మహారాజా! నేనిప్పుడు ఏ ప్రశ్నా అడగను. తదుపరి కర్తవ్యం ఏమిటి అని మాత్రమే చెబుతాను అంటూ భేతాళుడు భిక్షువు విక్రమార్కుని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనీ ఆ భిక్షువునే బలి ఇచ్చి తనను వశపరచుకోమని చెప్పాడు.
విక్రమార్కుడు ఆలోచనలో పడ్డాడు.
