Dr.R.N.SHEELA KUMAR

Children Stories

4.0  

Dr.R.N.SHEELA KUMAR

Children Stories

ఆధునిక నక్క

ఆధునిక నక్క

1 min
185


అది ఒక పెద్ద పట్టణం. సుభి ఓ పెద్ద స్కూల్ లో ప్రీ కె. జి చదువుతుంది. టీచర్ సుష్మిత అందరికి రేపు ఒక్కొక్కరు ఒక్కో కద చెప్పాలి అని చెప్పింది. అంతే పిల్లలందరూ చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ లతో చెప్పారు. సుభి వాళ్ల నాన్నమ్మ ని పాత కాదనే ఇప్పటి బాని లో చెప్పు బామ్మా అన్నది న

సరే అని బామ్మ నక్క అడవిలో అన్నీ జంతువుల కన్న తెలివైనది. పాత కథలలో రాజు సింహం గుహలో పొంచి వున్నప్పుడు నక్క చూసి తొర్రలో దాగుంటుంది. అదే ఇప్పుడు నక్క ఏమి చేస్తది అని అడిగింది బామ్మ. అప్పుడు సుభి కి కుందేలు కధ జ్ఞాపకం వచ్చింది ఆ బావి దగ్గర ఇంకో రాజున్నాడు అని తీసుకెళ్లి ఆ బావిలో తోసేసిందా అని అడిగింది వెంటనే బామ్మ నవ్వి లేదురా కన్న అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.

సింహ రాజా నన్ను తేనేస్తే మీకు ఈ అడవిలో ఎక్కడ ఏ జంతువులున్నవి సమాచారం తెలిపేదేవ్వరు ఆలోచించండి. ఆ లోయలో ఎక్కువ జింకలు, కుందేళ్లు ఉంటాయి, మీకు త్రోవ తెలియదు కద ఎవరు మిమ్మలిని తీసుకువెళతారు అని అడిగింది. వెంటనే సింహం గర్జీస్తూ సరే నన్ను అక్కడకు తీసుకొని వెళ్ళు అన్నది. ఐతే ఓ ఒప్పందం నేను లోయలోకి రాను దూరం నుండే చూపిస్తాను మిగిలిన జంతువులకు తెలిస్తే నన్ను ఎవరు చేర్చుకోరు బాకు స్నేహితులు వుండరు అంది. ఆహా వున్న జంతువులన్నీ నాకే అని సింహం సంబర పడిపోయింది.

అలా కొంత దూరం నడిచి వెళ్లాక అదో రాజా ఆ కనపడేదే లోయ మీరు వెళ్ళండి అంటూ అక్కడే నిలించింది. వెంటనే సింహం ఒకే దూకుడు దూకింది అదో పెద్ద లోయ అందులో దూకిన వారెవ్వరు ఇప్పటి వరకు బయట పడలేదు. అంతే అడవిలో మిగిలిన జంతువులందరు క్షలిసికట్టుగా ఆ నక్కను రాజుగా ప్రకటించి సంతోషంగా జీవించాయి.


Rate this content
Log in