తిండిమానితే ఆకలితీరున్
తిండిమానితే ఆకలితీరున్


పూరణకై సమస్య ఇది...
"తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
ఉత్పలమాల
మండఁనిరంతరంబుననుమానముతోనుదరంబెయాకలిన్
మండలవైద్యుఁజేరఁనిజమౌమధుమేహవికారమేయనెన్
ఖండితమైనపథ్యవిధికట్టితినాల్కనుతన్నిషిద్ధమౌ
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్