రెక్కలొస్తున్నాయ్ జాగ్రత్త!!
రెక్కలొస్తున్నాయ్ జాగ్రత్త!!


రెక్కలొస్తున్నాయ్ జాగ్రత్త!!
--------------------------------------
కాళ్ళు కదలటం
బరువైపోయింది
కీళ్ళు కదలటం
అరుదైపోయింది
చక్రాలు తిరగటం
కరువైపోయింది
రెక్కలొస్తున్నట్లు
కనబడుతోంది కళ్ళకి...
కానీ ఆ దృశ్యాన్ని చూస్తూంటే...
నిజమో స్వప్నమో
అర్థమవటం లేదు
నిజమే అనుకుంటూ...
కదలికర్మాగారాల్లో
వాల్వులచక్రాలు త్రిప్పిన శ్రామికుల్ని
అభినందిద్దామనుకుంటే...
విశాఖపాలిమర్విషఘటనలు అడ్డువచ్చి
షటప్ మూసుకో మంటున్నాయ్
రెక్కలొచ్చి విదేశాల్లోంచి
ఎగిరి వస్తున్న
మనవాళ్ళను తలచుకుంటూ
ఆనందిస్తూంటే...
పడగవిప్పుతున్న కరోనామృత్యువ్యూహాలు గుర్తుకివచ్చి
కేర్ ఫుల్ కాచుకో మంటున్నాయ్
లాక్ డౌన్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ లక్షణాలు బయల్పడుతున్నాయ్
క్రొత్రక్రొత్తభయాలు ప్రజల్లో చెలరేగుతున్నాయ్