పసిగడతాయ్
పసిగడతాయ్


పసిగడతాయ్
పగిలిన తలలోంచి
తన్నుకొస్తున్న
నెత్తురులా
మనస్సులోంచి
భావాలుతన్నుకొస్తుంటే
వృథాగావదిలేయలేక
అక్షరాలుగా మార్చుతూంటా...
అవి జంటలుగా
గుంపులుగా పదాలుగా మారిపడుతుంటే
వృథాఅవుతున్నాయన్నారెందరో
కానీ తృప్తిగా నవ్వుకున్నా
అవిపడుతున్నది కవిసంగమంలో నని నాకు తెలుసుకాబట్టి!
మనసులు కవులచే చదవబడతాయ్
అక్షరాలతో కవిహృదయాలు మాట్లాడతాయ్
అక్షరాలను స్రవించిన తలల్లోని
అంతరార్థాలను వెతలను పసిగడతాయ్
గాదిరాజు మధుసూదన రాజు