ప్రేమ
ప్రేమ


ప్రేమను కురిపించడానికి వర్షం కాదు అది అమృతం
వికసించే పరిమళ పుష్పాల సుగంధమే ప్రేమ
నిష్కల్మష అమృతతుల్యమైన ప్రేమ అమ్మ ప్రేమ
విఫలమవడానికి ప్రేమ ఒక ప్రయత్నం కాదు అనుభూతి
ప్రేమను గెలుపొందిన వానికి ప్రేమ ఒక విజయం ఓడిన వానికి యుద్ధం
బాధపడడానికి ప్రేమ గాయం కాదు
వర్ణనకు అంతుచిక్కనిది ప్రేమ
కొలవటానికి ప్రేమ బరువు కాదు బాధ్యత
వరించడానికి ప్రేమ అదృష్టం కాదు స్పందన
వేదన చిందిన మనసుకే ఎరుక ప్రేమ విలువ
పరిష్కరించడానికి ప్రేమ సమస్య కాదు అవగాహన
ఒక్క కవిత లో నిర్వచించే అంత
చిన్న పదము కాదు ప్రేమ
తొలిప్రేమ చిగురించిన వేళ బంధాలు బలపడి తరుణాన ప్రేమ ఆవిర్భావానికి నాంది
మునిగిపోవడానికి ప్రేమ సముద్రం కాదు అనంతం
పడిపోవడానికి ప్రేమ పరుగు కాదు పదిలమైనది
బలి అయిపోవడానికి ప్రేమ జీవి కాదు జీవితం
ప్రేమకి మూలం ప్రేమే