నలుగుతున్న మనసులు
నలుగుతున్న మనసులు


నలుగుతున్న మనస్సులు
...............
నలుగుతున్నమనస్సులు
నలిపేస్తున్నదికూడామనస్సులే!
నలుగుతున్నమనస్సుకొడుకుదైనప్పుడు ఒకలా
తాళికట్టిన భర్తదైతే మరోలా
బిడ్డమొగుడుఅల్లునిదైతే ఇంకోలా
వ్యాఖ్యానాలుచేస్తుంది ఆడమనసు రకరకాలుగా....
ఆడమనస్సంతే ...
న్యాయానికి అర్థంకాని మమకారపుమాయలా
అమ్మలా ఒకలా,
ఆలిలా ఒకలా,
అత్తమ్మలా ఒకలా
భరించటానికైనా
నిరసించటటానికైనా
వీలుకాని అమ్మతనపు పిచ్చిలా
ఇంటింటా ఒకేలా....