STORYMIRROR

Srinivasa Bharathi

Children Stories

4  

Srinivasa Bharathi

Children Stories

కళ్ళ భాష....శ్రీనివాస భారతి

కళ్ళ భాష....శ్రీనివాస భారతి

1 min
400

అమ్మా నాన్నా

నేనిక్కడ క్షేమం

మీరక్కడెలా ఉన్నారు

అమ్మ ఆఫీసుకు వెళ్తోందా

నాన్నా మీరూ వెళ్తున్నారుగా

నా మంచీ చెడ్డలు

అమ్మమ్మ బానే చూసుకొంటోందిగా

పిన్నైతే అస్సలొదలడం లేదు

ఇంకో పిన్ని ...అప్పుడప్పుడు

అక్కడ ముత్తాతని నేను ఆటపట్టిస్తా

ముత్తమ్మకు కూడా నేనంటే భయం

అందరూ నా వైపే చూస్తూ

నడుస్తూ పడి పోతానని..భయపడుతూ

ఎన్ని కబుర్లు చెప్తున్నారో

తాత క్కూడా ఎంత ముద్దో

సెలవొస్తే చాలు

నాన్నమ్మ తాతగారు హాజరు నాముందు

అక్కడ కూడా ఎంతమందో

నేనెప్పుడు వస్తానో అన్నట్టు చూస్తూ

అందరూ

ఒకరితర్వాత ఇంకొకరు

తాతలంతా

నేనేం అంటానో ..అన్నట్టు చూస్తే

నాకు భలే నవ్వొస్తుంది

అమ్మమ్మలు

నన్ను మార్చి మార్చి ముద్దుచేస్తూ

బాబాయిలు పలకరిస్తూ

తాతమ్మ ఒడిలో కాస్సేపు ఆడుతూ

అత్త, మామ, బావల్తో కాలక్షేపం...

ఆ ఇంటికీ, ఈ ఇంటికీ

నేనే పెద్ద తెలుసా

నాకోసం

మీరిద్దరూ బెంగ పడకండేం

రోజూ ఉదయం

నా కోసం ఎదురుచూపులు అందరివీ

ఇంత అదృష్టం పంచిన

నాన్న అమ్మలైన మీకు

మాటలొచ్చాక

బోలెడు కబుర్లు చెప్పి

సంతోషంలో ముంచేస్తాలే...

కళ్లతో రాస్తున్న ఉత్తరం

ఇప్పటికి సరి

మళ్ళీ మరోసారి....

ఉంటా....బై బై...

********#######*********



এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন