కేరింతలు
కేరింతలు
పసిపాపలొ దైవత్వం.... నవ్వుల్లో కేరింతలు.... యువకుల్లో క్రికెట్ ఆట సంబరాల్లొ కేరింతలు... యువతుల్లో ముచ్చట్లలో కేరింతలు... పాఠకుల్లో హాస్యానంద కేరింతలు... మధురమైన అనుభూతికి మనసు కేరింతలు... వృద్ధుల వదనాల్లో. పిల్లలు మాట్లాడితే కేరింతలు..... ఇప్పుడు ఒంటరి వాళ్ళమై కేరింతలు.... సెల్ ఫోన్ చూస్తూ కేరింతలు... ఫోన్ మాట్లాడుతూ కేరింతలు... ఇవన్ని నిజమైన ఆనంద కేరింతలేనా? నీలిమేఘాల్లోంచి రాలిపడ్డ తుషారబిందువు నన్ను తాకితే నిజమైన కేరింత... అందమైన జలపాతం ఒయ్యారాలొలుకుతూ కిందకు దిగజారిన దృశ్యానికి మనసు కేరింతలు... వేకువ జామునే పక్షుల కిలకిలా రావాలు శ్రావ్యంగా వినడం, మన గడపలోకి సూరీడు తొంగి చూసి పలకరించడం., పరహితము కోరి , పరులకు సాయ పడితే, మనసుకు కలిగే పులకరింతే కేరింత...... ఇవి అసలు, సిసలైన కేరింతలు...
