STORYMIRROR

Ramesh Babu Kommineni

Others

4  

Ramesh Babu Kommineni

Others

ఎదుటే నిలిచినా..

ఎదుటే నిలిచినా..

1 min
325

ఎదుటే నిలిచినా ఎదలో ఏదో గుబులు

కుదుటే మరచిన మనసే ఒకటే రగులు

కథలే కళ్ళల్లో తారాడి కావ్యాలవునుగ

కదిలే పోకళ్ళు పోరాడి కవితలవునుగ

జావళి గానం జాజి సౌరభం జతగానూ

కాహళి రాగమే కాంక్షలన్నీ తోడుగానూ

ఎదుటే నిలిచినా ఎదలో ఏదో గుబులు

కుదుటే మరచిన మనసే ఒకటే రగులు


కనువిందు చేసే సోయుగం కమనీయం

మునుముందు సాగించేసి మహనీయం

కనువిందు చేసే సోయుగం కమనీయం

మునుముందు సాగించేసి మహనీయం

మనసులో మల్లెల గుబాళింపునింపాలి

వయసులో ఆవలపునే ఒట్టేసి ఒంపాలి

ఎదుటే నిలిచినా ఎదలో ఏదో గుబులు

కుదుటే మరచిన మనసే ఒకటే రగులు

కథలే కళ్ళల్లో తారాడి కావ్యాలవునుగ

కదిలే పోకళ్ళు పోరాడి కవితలవునుగ


ఎంత దాహమో ఎడారి మదికి ఎరుకా

అంత మోహమే తోడై పెంచేను కోరికా

ఎంత దాహమో ఎడారి మదికి ఎరుకా

అంత మోహమే తోడై పెంచేను కోరికా

జావళి గానం జాజి సౌరభం జతగానూ

కాహళి రాగమే కాంక్షలన్నీ తోడుగానూ

ఎదుటే నిలిచినా ఎదలో ఏదో గుబులు

కుదుటే మరచిన మనసే ఒకటే రగులు


Rate this content
Log in