" చట్టమేసే మంత్రం"
" చట్టమేసే మంత్రం"
"చట్టమేసే మంత్రం " - RK
నాగరికతా నరులని నడిపించేదే చట్టం
అనాగరికులకు అవుతుంది కొన్నిసార్లు చుట్టం
డబ్బుంటే నడవలేని వాడివద్దకి కూడా
నడిచివస్తుంది ఈ చట్టం
ప్రభుత్వ అధికారులు ఇష్టారాజ్యంగా
వాడుకునే యంత్రం
మనిషిని బట్టి వేస్తోంది అదునుగా మంత్రం
చట్టానికి నాయకుడు లేడు,
నావికుడు అంతకన్నా లేడు
ఎవడికి తోచినట్టుగా వాడు వాడుకుంటాడు
అందిన అమాయకుడితోనే చట్టం తెలిసిన
నీతిహీనుడు ఆడుకుంటాడు
ఈ చట్టం కొందరికి ఆకలి తీరుస్తుంది
మరికొందరికి ఆకలే లేకుండా చేస్తుంది
కొందరికి అత్యాశని పుట్టిస్తుంది
ఇంకొందరికి ఆశలే లేకుండా చేస్తుంది
బద్ధకంతో బల్లపై తలపెట్టి నిద్రపోయే
ప్రభుత్వ అధికారులు ఉన్నచోటా
ఓ మూలన నక్కి, శిథిలమైపోతున్న
పుస్తకాల మధ్య చిక్కి చతికిల బడిపోతుంది
అమాయకుడి ఆవేదన ముందు
ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది
ధనవంతుడి ఆవేశం ముందు
ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరవుతుంది
చట్టం ఓ యంత్రమే అయినా మంత్రం వేసేది అమాయకుడికే, తంత్రమేసేది కూడా అల్పుడికే
చట్టంలోని అక్షరాలు సిగ్గు పడినా
చట్టం ఎప్పుడు సిగ్గు పడుతుందో మరీ...
అయినా బ్రతక నేర్చిందానికి
చితక్కొట్టినా సిగ్గురాదు
చివరికి చట్టం మీదా కవిత రాసి
నా అక్షరాలే సిగ్గుపడ్డాయి కదా!!
- RK
