STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

4  

Midhun babu

Children Stories Fantasy Children

బొమ్మలు

బొమ్మలు

1 min
5


బొమ్మలోయమ్మ బొమ్మలు,

ముద్దుముద్దు బొమ్మలు మురిపాల బొమ్మలు,

చరిత్ర చెప్పు బొమ్మలు,

చదువు నేర్పు బొమ్మలు,

మా'నవ'జీవితంతో పెనవేసుకున్న బొమ్మలు,

బొమ్మలోయమ్మా బొమ్మలు.


సుందరమైన దేవుని బొమ్మలు

హృదయపు కోవెలకు

చెరపలేని తలపులు,

అలనాటి వెండితెర వెలుగులు

ఈ తోలుబొమ్మలు,

కులుకునేర్పు

కుందనపు బొమ్మలు

 కొండపల్లి కొయ్యబొమ్మలు,

పంజరాన రామచిలక బొమ్మలు చెప్పునులే ఎదసవ్వడి సుద్దులు,

మనసు ముచ్చట

 తీర్చేటి బొమ్మలు

మమతలు పంచేటి అనురాగ ఊసులు.,

బొమ్మలోయమ్మ బొమ్మలు.


కోరిన కోర్కెలు తీర్చేటి ఇలవేల్పుల బొమ్మలు

వేసారిన గుండెకు ఓదార్పులు,

ధర్మ దారిలో నడిపించు మహనీయుల బొమ్మలు

చైతన్యపు జీవిత రహదారులు,

నాగరికపు ఆనవళ్ల

పల్లెటూరి బొమ్మలు

ప్రగతిపథపు స్వప్నసాకార గుర్తులు,

కనులవిందు దరహాసానికి

అనుబంధపు నేస్తాలు మనసుమెచ్చేటి బొమ్మలు.,

బొమ్మలోయమ్మ బొమ్మలు.


ప్రకృతిని సంరక్షించమని చెప్పేవే బంకమట్టి బొమ్మలు,

పిల్లలలో గ్రాహ్యశక్తి పెంచేవే 

విజ్ఞాన ప్రభోధిత బొమ్మలు,

గూడు చెదిరిన గోడు చెప్పు

వన్యప్రాణి బొమ్మలు,

ఆటలోని భాగమై

స్నేహపు మాధుర్యం తెలియచేయు

చిరునవ్వుల చెలిమిబొమ్మలు,

జీవన నాదాలు వినిపించు సొగసైన బొమ్మలు

సంస్కృతి సంప్రదాయాల సంతసాల రూపులు.,

బొమ్మలోయమ్మ బొమ్మలు

మనసు పూల ఊయలలో

పరిమళ ప్రేమ తరువులు.



Rate this content
Log in