అమ్మ
అమ్మ
1 min
1
ఈ ప్రపంచంలో మనల్ని
చూడకముందే ప్రేమించే
ఒకే ఒక స్త్రీ "అమ్మ"**
అమ్మ నడయాడే ఇల్లు బృందావనం
ఆమె ప్రేమ ఎప్పటికీ తీర్చలేని రుణం
ఆమె పలుకులు దాటించు దుఃఖసాగరం
ఆమె పెట్టే గోరుముద్ద
మనకు అమృత సమానం!!
అమ్మ ప్రేమకు అంతరాలు లేవు..
అమ్మ ప్రేమకు అవధులు లేవు...
అమ్మ ప్రేమకు ఆస్తులు
సాటి రావు...
అమ్మ ప్రేమకు ఆభరణాలు
సరి తూగవు...
అమ్మ ప్రేమను అంకెలతో
విలువ కట్టలేము...
అమ్మ ప్రేమకు అందచందాలు లేవు
అమ్మ ప్రేమ అమరం,అఖిలం,
అజరామరం..
గుడికి వెళితే దేవుడితో మన కోరికలు చెప్పుకుంటాం....
మనం ఏమి అడగకుండానే
అన్నీ అమర్చి పెట్టేది "అమ్మ" ఒక్కరే
