అలజడి చుక్కలు
అలజడి చుక్కలు


అలజడి చుక్కలు
------------------------
వక్రవాక్కులు
విషపుచుక్కలై
మనస్సు సరస్సు చక్కగా
నిలుపుకున్న
ప్రశాంతాన్ని
లాక్కెళ్ళి పోతున్నాయ్
పాటిస్తున్న మౌనం
సమాధానంగా మారటం చూశా!
సాగిస్తున్న ధ్యానం
మహదానందాన్ని ఇవ్వటం చూశా!
ఆచితూచి మాట్లాడిన మాటలు
అద్భుతఫలితాల్ని అందించుటచూశా!
కలవటం
విడివడటం
సంచలనాత్మక ప్రక్రియలే!
ముడిపడియుంటాయ్ సహజంగా!
పెదవులు పలికెడు మాటలతోనే!!
విడుదల అయినా
కలయిక అయినా
చెడుకలిగించెడు
అలజడులుంటే
కనిపెడదాం!ఆపేద్దాం!!