Ambica Lakshmi

Children Stories Drama Children

4.5  

Ambica Lakshmi

Children Stories Drama Children

తెలివైన మంత్రి

తెలివైన మంత్రి

2 mins
641


                   నెప్ట్యూన్ దేశ మహారాజు విజయంద్ర సింగ్.ఆయన పాలనలో ప్రజలు చాలా సుఖసంతోషాలతో జీవించేవారు.కుల మతాలకు అతీతంగా ఉండేది రాజుగారి పాలన.అతని భార్య ఉన్నిస ఆమె ఒక ముస్లిం అమ్మాయి వారిది ప్రేమ వివాహం.మంత్రి హిందువు.ఎటువంటి వెత్యసం లేకుండా ప్రతి పండగను తన చేతిమీద జరిపించేవారు.రాజుగారికి తన మంత్రి మీద చాలా నమ్మకం ఉండేది ఎందుకంటే ఎటువంటి క్లిస్టపరిస్తితినైన చాలా చాకచక్యంగా వ్యవహరించేవడు.కానీ ఒకసారి హఠాత్తుగా మంత్రిగారి మరణం సంభవించింది.దురదృష్టవశాత్తు రాజుగారు యుద్ధంలో ఉన్నప్పుడు జరగడంతో మంత్రిగారి చివరి చూపు చూడడానికి కుదరలేదు.విషయం తెలిసిన తరవాత రాజుగారు కృంగిపోయారు.కొన్ని నెలల తర్వాత రాజుగారు మంత్రి పదవికి పోటీ జరిపించాలి అని నిర్ణయించుకున్నారు.కులం మతం జాతి వర్గం తేడా లేకుండా ఎవరైనా పాలుపంచుకోవచ్చు అని ప్రకటన ఇచ్చారు.వార్త తెలుసుకున్న వారు చాలామంది వచ్చారు.వేరువేరు ప్రాంతాలవారు పాలుగొనడం కోసం విచ్చేశారు.రాజుగారు అందరినీ సభలో కూర్చోబెట్టి ప్రశ్నలు అడగసాగారు.మొదటి ప్రశ్నగా "వకూతార్మారం" ఈ పదం అర్థం చెప్పమని అడిగారు.అందరూ ఇలాంటి పదం అసలు ఉండదని చెప్పసాగారు.కానీ వారిలో ఒకరు లేచి ఇది విష్ణువుని అవతారాలలో ఒక్క అవతారం. మీరు పదాలని తిరిగి ఇచ్చారు అసలైన పదం "కూర్మావతారం" అని చెప్పాడు.రెండోవ ప్రశ్నగా "హఠాత్తుగా మన రాజ్యం మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చినట్లయితే ఏంచేస్తారు" అని అడిగారు.అందరూ యుద్ధం చేయాలి అని చేప్పాసాగారు.కానీ వారిలో ఒకరు మాత్రం రాజుకి రాజ్యం కంటే రాజ్యప్రజల సంరక్షణ మీద ఎక్కువ శ్రద్ధ ఉండాలి కాబట్టి వచ్చిన శత్రువు మనకన్నా బలవంతుడు అయితే రాజు వారికి తమ రాజ్యం యొక్క పరిస్థితిని వివరించాలి. సమాన బలం ఉంటే తెలివిగా యుధవ్యూహం రచించలి.మనకన్నా బలహీనుడు అయితే వారికి మన రాజ్య బలం చెప్పి వారికి అర్థమయ్యేలా చెయ్యాలి అనిచేపారు.మూడోవ ప్రశ్నగా "మంత్రి యొక్క ముఖ్యమైన లక్షణం ఎంటి" అని అడిగారు. అందరూ రాజ్య సంరక్షణ అని చెప్పసాగారు కానీ ఒకరు మాత్రం మంత్రి యొక్క ముఖ్య గుణం రాజు ప్రతి మనుగడను పరిశీలించడం మరియు ప్రతి క్కిస్టపరిస్తితిలో రాజుకు తోడుగా నీడగా ఉండీ వేనంటే ఉంటూ ప్రతి సమస్యని సులభంగా పరిష్కరించడం మంత్రి యొక్క ముఖ్యమైన గుణం అని చెప్పడంతో రాజు రెండో ఆలోచన లేకుండా ఆ వ్యక్తిని మంత్రిగా ప్రకటించాడు.ఆయన మాత్రమే మూడు ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు.

                  చివరకు తెలిసింది ఏమిటంటే సరైన సమాధానాలు ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు రాజుగారు మంత్రి అయిన సుధనంద కుమార్ కొడుకు గోపలనంద కుమార్ ఈ విషయం తెలిసిన రాజుగారు మరింత అనందపడారు మరియు గోపాలనంద ని అతిధి సత్కారాలు చేసి మరీ ఆహ్వానించారు.తన్న తండ్రివలే చాలా తెలివిగా సలహాలు ఇస్తూ అతి తక్కువ కాలంలోనే రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు.రాజ్యం ముందుకన్నా మంచి ప్రగతిని సంపాదించుకుంది.రాజుగారి క్యతి భారతదేశంలోనే కాకుండా మిగిలిన దేశాలలో కూడా చెప్పుకోసాగారు.

                             (సమాప్తం)

                     



Rate this content
Log in