సూర్యగ్రహణం
సూర్యగ్రహణం


సూర్యగ్రహణం...చూద్దాం రారండి (కథ)
అది సంపూర్ణ సూర్యగ్రహణం రోజు 26 డిసెంబరు రెండువేల పందొమ్మిది.
"వెంకట్ నువ్వు ఎందుకు ఈ రోజు ఉదయం బడికి రాలేదు" అని అడిగాడు రామరాజు మాస్టారు
"సర్ ఉదయం సంపూర్ణ సూర్యగ్రహణం అని మా అమ్మ బడికి పంపలేదు" అని వెంకట్ సమాధానం ఇచ్చాడు.
"సర్ మా నాన్నగారు మాత్రం కొన్ని జాగ్రత్తలు చెప్పి, వాటిని పాటిస్తూ యధావిధిగా నీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి నన్ను బడికి పంపారు సార్" అని అంది విమల.
రామరాజు సార్ సోషల్ స్టడీస్ మాస్టారు కాబట్టి పిల్లల్లో గ్రహణాలు పట్ల ఉన్న సందేహాలను నివృత్త చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
"పిల్లలూ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురుంచి మీకు తెలిసిన విషయాలు చెప్పండి"అని చర్చ మొదలు పెట్టారు మాస్టారు.
పిల్లలు రెండువర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం రాహుకేతువులు కథలు చెబుతూ, పురాణ విషయాలు, నమ్మకాలు చెప్పి కేవలం రాహు కేతువులనే రాక్షసులు దేవతల చర్యలకు ప్రతీకార చర్యలుగా జరుపుతున్న చర్యలు వల్ల గ్రహణాలు ఏర్పడతాయి అని పెద్దలు చెప్పగా విన్నామని చెప్పగా...
రెండో వర్గం వారు గ్రహణాలు కేవలం ఖగోలపరమైన మార్పులు, సూర్యని చుట్టూ భూమి,భూమి చుట్టూ చంద్రుడు భ్రమనం, పరిభ్రమనం, కక్ష్యలు, రుజు మార్గాల అద్భుతాలు, అరుదైన పరిణామాలు వల్ల గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పారు.
పిల్లల మధ్య వాదోపవాదాలు పెరిగిపోతుండగా మాస్టారు కల్పించుకొని తన వివరణ ఇచ్చారు, ఈ రోజు సూర్యగ్రహణం కాబట్టి దాని గురుంచి తెలుసుకుందాం అని"భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలోకూడా చెప్పబడింది. సూర్య గ్రహణము అమావాస్యనాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.
భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని చూస్తారు. 1999లో ఐరోపాలో కనిపించిన సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు. దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. తరువాతి గ్రహణాలు 2005, 2006 లలోను, 2007 సెప్టెంబర్ 11 న వచ్చాయి. తరువాతి సంపూర్ణ సూర్యగ్రహణము 2008ఆగష్టు 1 న వచ్చింది, ఈ రోజు మరలా ఆ అద్భుతం సంభవించింది" "అని చెప్పారు.
"సర్ గ్రహణాలు సందర్భాల్లో మనం తీసుకో వలసిన జాగ్రత్తలు ఏమిటి"అని రేణుక అడిగింది.
మాష్టారు ఆ జాగ్రత్తలు గురుంచి చెబుతూ"గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలోనే గ్రహణం వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పెద్దలు. గర్భంతో ఉన్నప్పుడు అలాంటి నియమాలు పాటించకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతారు,ఎందుకంటే సూర్యగ్రహణం సందర్భంగా వచ్చే కిరణాలు, నేరుగా గర్భిణీ గర్భంపై పడితే తల్లికి, బిడ్డకి అనారోగ్య సమస్యలు రావచ్చు... గర్భిణీ మాత్రమే కాదు మనం కూడా గ్రహణాలును నేరుగా చూడకూడదు, శాస్త్రవేత్తలు సూచించిన రంగుకళ్ళద్దాలును ఉపయోగించుకొని మాత్రమే గ్రహణాన్ని చూడాలి లేకపోతే కళ్లకు ఇబ్బందులు వస్తాయి"అని అన్నారు
పిల్లలకు సూర్యగ్రహణంపై అవగాహన కల్పించి, సందేహ నివృత్తి చేసి,గ్రహణ సమయాన అటు పురాణాలు చెప్పిన జాగ్రత్తలు,ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్న జాగ్రత్తలు ఇంచుమించు ఒకే విధంగా ఉండటం ఒక విశేషం, శాస్త్రీయం"అని అంతటితో ఆ అంశాన్ని ముగించి, మరో పాఠం చెప్పడానికి సిద్ధం అయ్యారు మాస్టారు.
ఎం.వి. స్వామి
7893434721