STORYMIRROR

Naresh Babu

Others

4  

Naresh Babu

Others

సాహస ప్రియుడు

సాహస ప్రియుడు

2 mins
22

సాయంసంధ్య వేళ... నారింజ రంగు కిరణాలు సముద్ర తీరాన్ని ముద్దాడుతుంటే, సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు.

 బీచ్‌లో నారింజ సంతోషంతో నిండిన కేరింతలు, జన సందోహం తమ పనుల్లో తాము మునిగి తేలుతున్నారు. 

వాతావరణమంతా ఉల్లాసంగా, నారింజ రూపంతో ఉరకలు వేస్తోంది.

అక్కడ ఇద్దరు ప్రేమికులు, కమల, ధీరజ్ తమ ప్రేమ ముచ్చట్లలో మునిగిపోయారు. 
నారింజ పండు తిన్న ఆశలతో ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూస్తూ, కమల మెల్లగా అంది, "ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి!" అని ధీరజ్ కళ్ళల్లోకి గంభీరంగా చూస్తూ, "అవును, నేను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడ్డాను, నువ్వు కూడా స్థిరపడ్డావు..

 ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాము. మన పెద్దలను ఒప్పించి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం! మన కులాలు వేరైనా, మతాలు వేరైనా, మన ప్రేమ ఒకటే కదా!" అని ఇద్దరు నారింజ డ్రెస్ వేసుకున్న ఉత్సాహంతో తమ ప్రేమను పంచుకుంటున్న ఆ తరుణంలో, బీచ్‌లో ఒక కుటుంబం సముద్రపు అంచున ఉల్లాసంగా ఆడుకుంటోంది.

ఇంతలో, ఒక పెద్ద నారింజ వర్ణంతో నిండిన అల ఒక్కసారిగా బీచ్ వైపు దూసుకొచ్చింది.

 క్షణాల వ్యవధిలో ఆ కుటుంబాన్ని అల ముంచేసింది. 
ఎప్పుడు చేయి జారిందో తెలియదు గానీ, ఆ కుటుంబంలోని చిన్న పాపను అల తనతోపాటు సముద్రంలోకి కొట్టుకుపోతుంది. 

వాళ్ళు భయంతో, "రక్షించండి! కాపాడండి!" అని అరుపులు, కేకలు వేయడం మొదలుపెట్టారు.

వెంటనే కమల ఆ దృశ్యాన్ని చూసి, తన ప్రియుడు ధీరజ్‌ని పిలిచింది, "ధీరజ్, అటు చూడు! పాప సముద్రంలో కొట్టుకుపోతుంది! వాళ్ళు పాప కోసం ఆర్తనాదాలు చేస్తున్న ఆ పాపాని కాపాడాలి!" ఆ వైపు ఆందోళనగా చూసింది. 

ధీరజ్ ఆలస్యం చేయకుండా కమలను తీసుకుని అక్కడికి పరుగెత్తాడు. 

ఆ సన్నివేశాన్ని చూసి అతడు తట్టుకోలేకపోయాడు. 
అతడి ముఖం నారింజ వర్ణంలోకి మారి, అతడు ధైర్యంతో నిండిన సాహసం చేసి, అతడు వెంటనే సముద్రంలోకి దూకి, పాప మునిగి తేలుతుంటే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. 

పాప కడుపులో నీళ్లు పోయి ఉబ్బిపోయింది, వెంటనే అతడు కమల సహాయంతో పాప కడుపు వత్తించి కడుపులో నీళ్లు బయటికి తీపించాడు.

 అయితే కొంతసేపటికి స్పృహలోకి వచ్చింది. అందరూ సంతోషంతో వారి ముఖాలన్నీ నారింజ రంగులో వెలిగిపోతున్నారు. 
కమల ధీరజ్‌ని చూసి, "ఒక గొప్ప సాహసికుడిని నేను ప్రేమించాను!" అని మనసులో నారింజ వర్ణంతో అతడు గొప్ప సాహస ప్రేమికుడు అన్న ధీమాతో అనుకుంది.

అతడికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కృతజ్ఞత చెప్పారు.

:::::;;;;;;;;;;;;;;;;;;;;;:::'''''''''''':::;;;;;;;;;;;''::::::;:::;;

                  సమాప్తం


Rate this content
Log in