ఆశ
ఆశ
క్లాస్ టీచర్ పాఠం చెబుతుంటే, అమూల్యకు మెల్లగా కనురెప్పలు బరువయ్యాయి.
వెనుక బెంచీలో కూర్చున్న ఆ పాప, టీచర్ కంట పడకుండా, తన చేతులపై తల ఆనించి నిద్రలోకి జారుకుంది.
క్లాస్‌రూమ్ గోలంతా సన్నగా మారి, పాపను ఒక మధురమైన నిద్రలోకి లాగేసింది.
అమూల్య నిద్రలోకి జారుకోగానే, పాపకు ఒక అద్భుతమైన కల వచ్చింది.
ఆ కలలో, ఆ అమ్మాయి ఒక రంగుల ప్రపంచంలో ఉంది.
అక్కడ ఒక పండు ముసలి తాత, బండెడు చాక్లెట్లను నింపుకున్న బండిని కష్టంగా లాక్కుంటూ వస్తున్నాడు.
ఆ చాక్లెట్ల సువాసన అమూల్య ముక్కుపుటాలను తాకింది, ఆ అమ్మాయి కళ్ళల్లో మెరుపు మెరిసింది.
"చూడు పాప, నాకు కొంచెం సహాయం చేస్తావా? ఈ బండిని ముందుకు దొబ్బడానికి చాలా కష్టంగా ఉంది..
నాకు వయసు అయిపోయింది, కొంచెం సహాయం చేయరాదు," అని ఆ తాత అమూల్యను అడిగాడు.
వెంటనే అమూల్య కళ్ళల్లో ఆశ మెరిసింది.
"నేను బండి దొబ్బడంలో సహాయం చేస్తే నాకు ఏమిస్తావు తాతా?" అని అడిగింది.
తాత నవ్వుతూ, "ఇదిగో అమ్మ, బండి నిండా చాక్లెట్లు ఉన్నాయి..
నీ ఇష్టం వచ్చినన్ని తీసుకో!" అని చెప్పాడు.
ఆ మాట వినగానే అమూల్య ముఖం వెలిగిపోయింది.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆ చిన్నారి తన చిన్ని చేతులతో బండిని బలంగా దొబ్బడం మొదలుపెట్టింది.
చాక్లెట్ల కోసం ఆ పాప మనసు ఆరాటపడుతోంది, ఎప్పుడెప్పుడు వాటిని అందుకుంటానా అని ఎదురుచూస్తోంది.
అలా చాక్లెట్ల ప్రపంచంలో విహరిస్తున్న అమూల్యను, ఒక్కసారిగా టీచర్ గొంతు నిద్రలేపింది.
"అమూల్యా! నిద్రపోతున్నావా?"అని టీచర్ ఆ పాపను కుదిపింది.
సడన్‌గా నిద్రలేచిన అమూల్య, కళ్ళు నులుముకుంటూ, తన చుట్టూ చాక్లెట్ల కోసం దిక్కులు చూసింది.
కలలోని రంగుల ప్రపంచం మాయమై, ఎదురుగా టీచర్ కోపంగా నిలబడి ఉంది.
వెంటనే తేరుకొని, సైలెంట్‌గా తన బుక్కు పట్టుకుని, ఏమీ తెలియనట్టు కూర్చుంది.
ఆ చాక్లెట్ల కల మాత్రం పాప మనసులో ఇంకా తిరుగుతూనే ఉంది.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;!!!!!!!!!!!!!!!!!!
శుభం
