STORYMIRROR

రాచర్ల నరేష్ బాబు

Others

3  

రాచర్ల నరేష్ బాబు

Others

పార్వతి రావు నిద్రాభంగం

పార్వతి రావు నిద్రాభంగం

1 min
11

పార్వతీ రావు, తన భార్య ప్రేమగా వడ్డించిన వేడివేడి అన్నం కడుపునిండా ఆరగించి, హాయిగా పడకగదిలోకి వెళ్ళాడు. 

రోజువారీ పనులన్నీ ముగించుకున్న అతని భార్య కూడా వచ్చి పక్కన చేరి, ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు.

నిద్రలో పార్వతీ రావుకు ఒక వింతైన, భయంకరమైన కల వచ్చింది. 

అది కేవలం కల కాదు, ఒక పీడకల. 

అతడి కలలో, భార్య తరపు బంధువు ఒకరు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, భారీ శరీరంతో అతడి గుండెల మీద కూర్చున్నాడు.

 ఊపిరి ఆడనంత బరువు, గొంతును బలంగా పట్టుకున్న చేతులు బిగబడ్డాయి.

 పార్వతీ రావు ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతూ, 'అరేయ్! ఎందుకురా నా గొంతు పట్టుకున్నావు? వదలరా!' అంటూ గట్టిగా కేక పెట్టాడు.

ఆ కేకకు పక్కనే నిద్రిస్తున్న భార్య ఉలిక్కిపడి లేచింది.

 'ఏందండి? ఏమైంది?' అంటూ కంగారుగా భర్తను నిద్రలేపింది. 

కళ్ళు తెరిచిన పార్వతీ రావు, చుట్టూ చూసి, 'ఓహో! ఇది కలా!' అని ఊపిరి పీల్చుకున్నాడు.

 ఆ క్షణంలో కలిగిన ఉపశమనం మాటల్లో చెప్పలేనిది.

 భర్త ముఖంలో భయం చూసి, 'బాగుంది, కలలు కనండి.. 

కానీ ఇలా మీరు కిర్రుబుర్రుమని అరుస్తుంటే నాకు భయం వేస్తుంది కదా!' అని విసుకుంటా అతడి భార్య అంది. 
పార్వతీ రావు జరిగిన కలను వివరంగా చెప్పాడు. 

అతడు భార్యతో,''మీ బంధువు ఒకడు వచ్చి నా గుండెల మీద కూర్చొని, నా గొంతు పట్టుకున్నాడు!''అని గాబరా పడిపోయాడు.

ఆమె నవ్వుతూ,''ఇలాంటి పీడకలలు కనకండి..

 నా నిద్ర ఎందుకు చెడగొడతారు?' అంటూ కొంచెం విసుక్కుని, భర్తకు మంచినీళ్లు ఇచ్చి తాగమని చెప్పింది.

 పార్వతీ రావు మంచినీళ్లు తాగి, ఆ పీడకల ప్రభావం నుండి బయటపడి, ప్రశాంతంగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.

;;;;;;;;;;;;;;;;;;!;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;...

                శుభం




Rate this content
Log in