కలలో దైవం
కలలో దైవం
రాము, తల్లి ప్రేమగా పెట్టిన అన్నం కడుపునిండా ఆరగించి, పడుకోవడానికి సిద్ధమయ్యాడు.
తల్లి పక్కన పడుకోబెట్టినా, అతడికి వెంటనే నిద్ర పట్టలేదు.
ఆ కుర్రాడు పక్కపై అటూ ఇటూ దొర్లుతూ, ఏదో తెలియని ఆలోచనలతో సతమతమవుతున్నాడు.
అలా చాలాసేపు మసిలిన తర్వాత, మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.
రాము నిద్రలోకి జారుకోగానే, అతడిని ఒక వింత లోకం ఆవరించింది.
అతడు ఎక్కడికో వెళ్తున్నాడు.
అది దట్టమైన అడవి.
ఎత్తైన వృక్షాలు, పొదలు దాటుకుంటూ నడుస్తున్నాడు.
"ఈ అడవి ఇంత విశాలంగా ఉందేంటి? ఈ చెట్లు, పొదలు ఎంత వింతగా ఉన్నాయో!" అని మనసులో అనుకున్నాడు.
"నా పక్కన ఎవరో నడుస్తున్నారే! వారి రూపం స్పష్టంగా కనిపించడం లేదే!" అని ఆశ్చర్యపోయాడు.
రాము మనసులో ఆలోచనలు మెదులుతుండగానే, అతడికి దూరంగా ఒక పురాతన గుడి కనిపించింది.
ఆ గుడిని చేరుకోవాలనే తపనతో రాము పాకుతూనే ఉన్నాడు.
ఎంత పాకినా, ఆ గుడి మాత్రం అతనికి దగ్గరవ్వడం లేదు.
శరీరం నిండా బురద అంటుకుంది.
"అయ్యో, ఇంత బురదతో దేవుడిని ఎలా దర్శించుకోవాలి?" అని మనసులో మథనపడుతూనే, అలా పాకుతూ ఉంటే అతని ఎదురుగా ఒక విశాలమైన సెలయేరు దర్శనమిచ్చింది.
"ఈ సెలయేరును ఎలా దాటాలి? ఆ గుడికి ఎలా చేరుకోవాలి?" అని రాము ఆందోళన పడ్డాడు.
అంతలో, పక్కన ఉన్న కొందరు సునాయాసంగా ఆ వాగును దాటి ముందుకు సాగిపోతున్నారు.
రాము కూడా అదే ప్రయత్నం చేశాడు, కానీ అతని అడుగు ముందుకు పడటం లేదు.
అవతలి వారు మాత్రం వెళ్తూనే ఉన్నారు.
గాలిలో ఏదో తెలియని శక్తి అతడిని ముందుకు నెట్టినట్టు అనిపించింది.
ఆ సెలయేటి ప్రవాహాన్ని తట్టుకుంటూ మెల్లగా అవతలికి చేరుకున్నాడు.
గుడిలో అందరూ దేవుడిని దర్శించుకుంటున్నారు.
రాము కూడా ప్రయత్నించాడు, కానీ అతని పొట్టితనం అడ్డుకుంది.
ఎగిరెగిరి చూసినా దేవుడు కనిపించి కనపడనట్టు అనిపించింది.
చివరికి, ఏదో ఒక విధంగా దేవుడిని దర్శనం చేసుకున్నాడు.
అంతలో, ఒక్కసారిగా రాముకు మెలకువ వచ్చింది.
"ఏమైంది రాము?" అని తల్లి అడిగింది.
"అమ్మా, నాకు ఒక కల వచ్చింది!" అంటూ తన కలను తల్లితో పంచుకొని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
ఆ కలలోని వింత అనుభవాలు, అడ్డంకులు, మరియు చివరికి దేవుడి దర్శనం అతడి మనసులో ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి.
::;;;;;;;;;;;;;;;;;;;;;;;;;!!!!!!!!!!!!!!!!!!!!!!!!!???????
శుభం
