ప్రయత్నం
ప్రయత్నం


ఏంటి వివేక్! ఈ మధ్య చాలా డల్ గా కనిపిస్తున్నావ్.క్లాసుల్లో పరధ్యానంగా ఉంటున్నావు అని అడిగింది క్లాసు టీచర్ హిమజ.స్కూల్ గార్డెన్ ఖాళీగా ఉంది.అంతా నిశ్శబ్దం.
మేడం.మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు.నా మనసంతా ఆందోళనగా ఉంటోంది అని తన మనసులోని భయాన్ని చెప్పాడు వివేక్.
చూడు వివేక్.నువ్వు భయపడితే మీ అమ్మగారు ఇంకా దిగులు పడిపోరూ.చెప్పు అంది హిమజ.
అవును మేడం.నేను సరిగ్గా భోజనం చేయకపోయినా ఇంటికి తొందరగా వెళ్లకపోయినా కూడా అమ్మ చాలా కంగారు పడుతుంది.నేను భయపడితే తను కూడా భయపడుతుంది అని బెంచీ మీద కూర్చున్నాడు వివేక్.
అందుకే వివేక్.ఆమె ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి.బిడ్డ్డలు తల్లి తండ్రులకు ఇచ్చే మానసిక బలం మరెవ్వరూ ఇవ్వలేరు.
ఆమె అనారోగ్యాన్ని మరిపించేలా సేవలు చేసి జాగ్రత్తగా చూసుకో.
నీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడానికి ప్రయత్నం చేయి.చదువుకుంటూనే ఆమెతో సమయం గడపడానికి ప్రయత్నించు.
ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని హిమజ వివేక్ కి ప్రోత్సాహం ఇచ్చింది.
వివేక్ టీచర్ కి థాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాడు.