పాపం రౌడీలు
పాపం రౌడీలు
సుబ్బారావు దారిలో ఒక రౌడితో అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు
ఇంతకీ సుబ్బారావు కి అతను రౌడీ అనే విషయం తెలియదు
కొంత దూరం వెళ్ళిన తరవాత సుబ్బారావు కి తెలిసిన ఒక వ్యక్తి సుబ్బారావుని తిట్టడం మొదలు పెట్టాడు
" సుబ్బారావా ఏంటయ్యా నువ్వు చేసిన పని , అతనితో నీకు ఎందుకు గొడవ వాడు అసలే పెద్ద రౌడీ ఇప్పుడు మీ ఇంటికి జనాలను తీసుకొని వస్తాడు ఏమో జాగర్తగా ఉండు " అని చెప్పి హెచ్చరించి వెళ్ళిపోయాడు
సుబ్బారావు గబగబా ఇంటికి వెళ్ళి జరిగింది అంతా పెళ్ళానికి చెప్పాడు
సుబ్బారావు భార్య సుబ్బారావు ను నెత్తి మీద ఒక్కటి కొట్టి అందుకనే మిమల్ని బయటకు వెళ్ళోద్దాని చెప్పేది
ఇప్పుడు చూడండి పెద్ద ముప్పు మూసుకొని వచ్చారు అని తిడుతుంటే
ఎవరో డోర్ కొడుతున్నా శబ్దం వినిపించింది
భయంతో మొగుడిని గబగబా లోపలికి పంపి డోర్ తెరిచింది
డోర్ తెరిచిన వెంటనే రౌడీలు లోపలికి వచ్చేసి నీ మొగుడిని పిలు పిలు అని గొడవ చేస్తున్నారు
కొంత మంది అయితే అక్కడే సోఫాలో కూర్చున్నారు
సుబ్బారావు భార్య
" అయ్యో మీరు అర్జెంట్ గా బయటకు వెళ్ళండి లేదంటే మీకే ప్రమాదం అని " అంటుంది
రౌడీలలో ఒకడు మాకు ఎంటి ప్రమాదం అని అందరూ కలిసి నవ్వారు
సుబ్బారావు భార్య " మాకు నిన్ననే కరోనా వచ్చింది అని " వారి అందరి మీద గట్టిగా హాషుం అని ఒక తుమ్ము తుమ్మింది
వారు అందరూ మారు మాట్లాడకుండా పరుగు పరుగున బయటకి పారిపోయారు
" ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు దానిని ఎదురించడం మన వల్ల కాకపోతే తెలివిని ఉపయోగిస్తే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది"
