STORYMIRROR

Harika Addala

Children Stories Children

4  

Harika Addala

Children Stories Children

జింక బద్ధకం

జింక బద్ధకం

1 min
1

ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసి మెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదనీ, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. 'ఏం కాదు, నేను కూడా చాలా చురుకైనదాన్ని' అని గొప్పలు పోయేది. 

ఒక రోజు ఇదేమాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని... 'సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి... దానికీ కుందేలుకూ ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్నీ బహుమతిగా పొందొచ్చు' అని చెప్పింది.

దానికి కుందేలూ, జింకా సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలుకాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. 'అబ్బా... ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడమంటే కష్టమే. అలిసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా' అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టునూ, తుప్పనూ, బండనూ వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే  ఉంది! జంతువులన్నీ మెచ్చుకున్నాయి. 'అయ్యో... పక్కనే ఉన్నా బద్ధకంతో చూడక ఓడిపోయానే' అని బాధపడి జింక అప్పటినుంచీ తన పద్ధతిని మార్చుకుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్