STORYMIRROR

Ambica Lakshmi

Children Stories Comedy Inspirational

4.5  

Ambica Lakshmi

Children Stories Comedy Inspirational

ఎవరి బ్రతుకు బెస్ట్

ఎవరి బ్రతుకు బెస్ట్

4 mins
618

ఒక రోజు కాకిపిల్ల తన తల్లితో ఇలా అంది...

అమ్మ జనాలు మనల్ని చూస్తే ఎందుకు అంత చిరాకు పడతారు

అంతేకాకుండా మనం వారి పక్కకు వెళ్తే చాలు ..


చు చూ చు అని తరిమేస్తారు....

కొన్ని కొన్ని సార్లు మనం వారు కాలువ దగ్గర పెట్టిన ముద్దలు తిన్నెంత వరకూ ఎదురుచూస్తారు ఎందుకలా అమ్మ.....


దానికి వల్ల అమ్మ ఇలా చెప్పసాగింది....


తల్లి మనుషులు ఆశవాధులు వారు సమయానికి తగ్గట్టు మారిపోతారు..చెట్టు ఆకులు చూసావా ఎట్టు గాలి వేస్తే అటు వైపు తిరిగిపోయి అలానే మనిషి కూడా మనతో అవసరం ఉంటే మన కోసం ఎదురుచూస్తారు అదే మన వారికి నచ్చకపోతే మాత్రం నాన చివాటులు పెట్టీ రాళ్ళు ఇచ్చి మరు కొట్టేస్తారు...

అంతే కాకుండా దానికి తగట్టు సామెతలు కూడా..

కాకిపిల్లా కాకికి ముద్దు అని

కాకిపిల్లకు ఏం తెలుసు ఉండెలు దెబ్బ ఇలాంటి చాలా సామెతలకు మనల్ని ఉపయోగించుకుంటారు రా నాన్న...

అందుకనే మన బ్రతుకే బెస్ట్...


కోతిపిల్ల తన తల్లితో ఇలా అంటుందట....

అమ్మ మనిషి కోతి నుంచి పుట్టాడు అని అంటారు కదా.. మరి వారు మనల్ని చూసి భయపడతారు తిట్టుకుంటారు ఎందుకని అమ్మ.....నేను ఎందుకని మనిషిని అవ్వలేదు ఇప్పటివరకు

దానికి వల్ల అమ్మ ఇలా అంది...


నాన్న దేవుడు ఈ సృష్టిలో చాలా జీవరాశులను పుట్టించాడు అలానే మనల్ని కూడా పుట్టించాడు మనలో ఎవరైతే ఎక్కువ పాపాలు చేశారో వారు మనుషుల కింద రూపకల్పన పొందారు..

అంటే మనం కూడా ఎక్కువ పాపాలు చేస్తే అలా అయిపోతమా.... అలా కాదు నాన్న మనం ఏదైనా పాపం చేస్తే మనకు దండన ఉండదు కానీ వారికి అలా కాదు వారు ఏమైనా తప్పు చేస్తే జైల్ శిక్ష పడుతుంది అందుకనే నువ్వు పాపాలు ఏమీ చెయ్యకు అలా చేస్తే మనిషివి అయ్యి జైల్ కి వెళ్ళవలసి వస్తుంది ...సరే నా....

మనుషులు మన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు...

కోతి మొఖంధన అని...

నీకు బాగా కోతి చేష్టలు ఎక్కువైపోయాయి ...

దీనికి తోక ఒక్కటే తక్కువ....అని ఇలా చాలా మాట్లాడుకుంటారు....

నువ్వు పాపాలు ఏమీ చెయ్యలేదు కాబట్టి ఇంకా కోతిలా ఉండిపోయావు .......

అందుకనే మన బ్రతుకే బెస్ట్...


పంది పిల్ల వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మ నువ్వు గమనించవా ఇందాక మనం మన ఇంటికి వస్తునప్పుడు కొంత మంది మనల్ని చూసి ఎంత చిరాకుగా మొఖం పెట్టారో ఎందుకు అలా పెట్టారు వాళ్ళు...???

అప్పుడు పంది తల్లి ఇలా సమాధానం ఇచ్చింది...


నాన్న వారు మన అంత అందంగా ఉండరు అని వారికి కుల్లు అంతేకాకుండా మన అంత స్వతంత్రం వారికి ఉండదు ఎక్కడపడితే అక్కడ దొల్లడానికి అందుకనే వారు మనల్ని చూసి అలా మొఖం తిప్పుకుంటారు అంతేకాకుండా మన దగ్గర వచ్చే సువాసన వారి దగ్గర రాదు అని వారి బాధ అంతే....అదే కాదు మన అంత స్వీట్ వాయిస్ వారికి లేదు రా అదే వారి ఏడుపు....😂

మనం మనుషులలో ఎంత ఫేమస్ తెలుసా...

పందిలా ఉంటావు అంటారు....

పందిలా బలిసావు అంటారు...

వారిలో వారు ఇలా పోల్చుకుంటారు...

బురదలో దొల్లే పంది అని...

నిన్ను కొట్టిన పందిని కొట్టిన ఒకటే అని....

అందుకనే మన బ్రతుకే బెస్ట్.....


కుక్క పిల్ల వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మ చూడు ఆ కుక్క ఆ ఇంట్లో సకల భోగాలు అనుభవిస్తుంది మన బ్రతుకు ఎందుకు ఇక్కడ పడి ఏడుస్తుంది...????

దానికి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది....


చూడు నాన్న నువ్వు ఒకటి ఆలోచించు మనం ఎక్కడికి కావాలి అంటే మనం అక్కడికి వెళ్లిపోవచ్చు కానీ పాపం దాని బ్రతుకు చూడు వారు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికీ వెళ్ళాలి అంతేకాకుండా మనకి రోజుకో రకం ఫుడ్ కానీ దానికి వాళ్ళు ఏం పెడితే అదే తినాలి అంతేకాకుండా బాగా ఇంపార్టెంట్ విషయం నువ్వు నాతో ఉన్నావు కానీ అది వాళ్ళ అమ్మ నాన్న కుటుంబానికి దూరంగా ఉంటుంది.....

అందుకనే మన బ్రతుకే బెస్ట్....

కానీ అమ్మ మనుషులు అందరూ మనల్ని ఎందుకు తిడతారు....???

తిట్టడం కాదు అది మనల్ని గుర్తుతెచ్చుకోవడం...

విశ్వాసం లేని కుక్క..

ఊర కుక్క..పిచ్చి కుక్క....గజ్జి కుక్క....నల్ల కుక్క...పనికిమాలిన కుక్క..చెత్త కుక్క...వంకర కుక్క..

ఒకటా రెండా....!!!!!ఇంకెన్ని సార్లు తలుచుకుంటారో నీకే తెలీదు...


పులి పిల్ల వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మ మనం ఎందుకని మాంసాహారం మాత్రమే తింటాము మిగిలిన ఆహారం మనం ఎందుకని తిన్నాము...????

దానికి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది....


మనం అధికారం కోసం పుట్టము నాన్న వేరే వాళ్ళలా మనం తిని తిరగకూడదు మనం వారిని పాలించాలి అడ్డుకోవాలి....వారు మనల్ని చూస్తేనే భయపడి సగం చస్తారు అలా మనం అన్ని రకాలు తింటే మనలో ఉన్న పౌరుషం చచ్చిపోతుంది అందుకనే మనం మన అధికారం కోసం కేవలం మాంసాహారం మాత్రమే పుచ్చుకుంటాము..

అందుకనే మన బ్రతుకే బెస్ట్....


ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో ఇలా అంటున్నాడు అమ్మ ఇంచక్క జంతువులు అన్ని స్వేచ్చగా ఉంటాయి కదా మరి మనం మాత్రం ఇలా ఎందుకు ఉంటాము మనం కూడా అలా గాలిలొ తిరుగుతూ అడవిలో హాయిగా చెట్ల మీద హ్యాపీ గా ఉంటే బాగుంటాది కదా అమ్మ...???

దానికి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది...


చూడు నాన్న నువ్వు ఒకటి గమనించాలి ఇక్కడ గాలిలొ ఎగరడం అడవిలో తిరగడం జంతువులు చేస్తాయి కానీ మనకి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి..వాటి ప్రకారం మన నడుచుకుంటే మనం కూడా సంతోషంగా ఉంటాము...జంతువులకు టీవీ ఫోన్స్ లాప్టాప్ ఇంకా సరి అయిన తిండి పల్లు ఫలాలు అన్ని దొరకవు అదే మనకి కష్టపడితే అన్ని చేతిలోకి వస్తాయి...అంతేకాకుండా మనం ఏం కవాలితె అది చేస్తాము మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు ఇంకా చాలా ఉపయోగాలున్నాయి మనకి నచ్చిన బట్టలు కట్టుకోవచ్చు ఇష్టమైన తిండి తినొచ్చు...

నిజమే అమ్మ చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి నచ్చిన కార్టూన్స్ కూడా చూడొచ్చు కదా....

అవును...

అందుకనే మనిషి బ్రతుకే బెస్ట్....

ఏది ఏమైనా ఒక తల్లి తన బిడ్డకి నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తుంది.... అది సీతాకోకచిలుక నుంచి మనిషి వరకు ఎవరైనా వాళ్ళని వారు చీన్నాబుచ్చుకోకుండ చెయ్యడం కోసం కొన్ని అబద్ధాలు చెపుతారు కొన్ని మంచి మాటలు చెపుతారు....

బిడ్డ తను తల్లి ఏం చెప్పిన సరే దానిని సంతోషంగా స్వీకరిస్తాడు......నమ్ముతాడు...

అందుకనే వారిది వీరిది కాదు అందరి బ్రతుకులు బెస్ట్ ఏ..........

అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఎవరి విధానాలు వారివి ఎవరి సంతోషాలు వారివి

(సమాప్తం)😁



Rate this content
Log in