STORYMIRROR

Ambica Lakshmi

Children Stories Action Classics

4  

Ambica Lakshmi

Children Stories Action Classics

దేవుడు ! నమ్మకం !

దేవుడు ! నమ్మకం !

5 mins
492

వెన్నెలను చూస్తూ చింతిస్తున ఆనందిని దగ్గరికి తీసుకొని ఏంటమ్మా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఈ వయస్సులో నీకేం ఆలోచనలు ఉన్నాయి చెప్పు నీకు ఏమైనా కావాలా ఎంటి ? అడిగింది తల్లి

ఆనంది :

అమ్మ ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎందుకు ఉంటారు

ఒకరికీ బాగా డబ్బులు ఉంటాయి

ఒకరికీ అసలు డబ్బులే ఉండవు

ఒకరు బాగా పాటలు పడతారు

ఒకరు బాగా నాట్యం చేస్తారు

ఒకరు బాగా నటిస్తారు

ఒకరు నటించే వాళ్ళకి సహాయం చేస్తారు

ఒకరు ఏమి చెయ్యకుండా అలా కూర్చుని ఉంటారు

ఒకరు బాగా చదువుతారు

ఒకరు చదివిన బాగా మార్కులు రావు

ఇంకా ఇలా చేలానే ఉంటాయి ఎందుకు అమ్మ

తల్లి :

నీ వయసు ఎంత నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎంటి అని నవ్వుతూ ఇది అంతా భగవంతుడి సృష్టి తల్లి

మనం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అనేవి అన్నీ ఆ భగవంతుడు ముందుగానే రాసేసి ఉంచుతాడు అంట అందుకనే ఒక్కొకరు ఒక్కొకలా పుడతారు

నీకు ఎందుకు ఈ అనుమానం వచ్చింది ఇంతకీ

ఆనంది :

ఏం లేదు అమ్మ మామూలుగానే

మనసులో అయితే నాకు తక్కువ మార్కులు రావడానికి నేను ఏం కారణం కాదు నా జీవితాన్ని ఆ దేవుడు ముందుగానే రాసేశారు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది

పక్కింటిలో

స్వప్న ఎంటి నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు అంట మరి నాకు చెప్పలేదు ఎంటి అని అడుగుతుంది తల్లి

స్వప్న :

ఫస్ట్ అయితే వచ్చాను అమ్మ కానీ నేను తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేశాను పేపర్లో అందుకనే ఏం ఏం తప్పులు చేశానా అని చూస్తున్నాను

స్వప్న తల్లి :

ఇలాంటివి చేస్తూ ఉంటేనే మన సామర్ధ్యం పెరుగుతుంది

తప్పు చేశాం కదా అని వదిలేయకుడదు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు జరిగింది అనేవి ముందు తెలుసుకోవాలి

ఎప్పుడూ నేను ఫస్ట్ వచ్చాను అనే గర్వం ఉండకూడదు అందరితో కలివిడిగా ఉంటే ఆ భగవంతుడు కూడా నిన్ను మెచ్చుకొని నువ్వు కోరుకున్నది తీరుస్తాడు

స్వప్న :

అమ్మ నేను విన్నాను దేవుడు మన తల రాత ముందుగానే రాసేస్తాడు అని మరి జరిగింది ఆయన మాత్రం ఎలా మారుస్తారు నా కోరికలు మాత్రం ఎలా తీరుస్తారు

స్వప్న తల్లి :

దేవుడు ముందుగానే రాసేసి ఉండవచ్చు కానీ ఒక్కసారి ఆలోచించు అన్ని పేజీల పుస్తకంలో ఏదోక పేజీలో నువ్వు కోరుకున్నది జరగాలి అని రాసి ఉంటే అందుకనే దేవుడికి ఎప్పుడూ మర్చిపోకు నీ సామర్ధ్యానికి మించి ఆశించకు

నమ్మకం మంచిది కానీ అతి నమ్మకం నీ జీవితాన్ని ముంచుతుంది

కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనసుతో భగవంతుడిని ధ్యానం చేసుకో మనస్పూర్తిగా నువ్వు ప్రతి పనినీ చేయి రాదు అని వదిలేయకుండా కనీసం ప్రయత్నం చేయి మిగిలినది అంతా భగవంతుడే చూసుకుంటాడు సరే నా నువ్వు వెళ్ళి ఇక పడుకో

స్వప్న ఆనంది ఇద్దరు ఒక్కటే స్కూల్ లో చదువుకుంటారు

ఆనందికి తెలియని విషయం ఏమిటంటే ఆనంది కూడా స్వప్న తో సమానంగా చదివే అమ్మాయే కానీ తన అసమర్ధతతో దేవుడి మీద నిందలు వేస్తూ ఏ పని సక్రమంగా చెయ్యడమే మానేసింది

కానీ స్వప్న అలా కాదు తన సామర్ద్యతకు మించిన పనులు చెయ్యడం ప్రతి పని వచ్చిన రాకపోయినా ప్రయత్నం చెయ్యడం చేసేది

అందరూ స్వప్న ను పోగిడేవరు కానీ ఒక్కరూ కూడా ఆనందిని మెచ్చుకునే వారు కాదు

వయసు పెరిగింది

స్వప్న పెద్ద కంపెనీ కి సీఈఓ అయింది తన కింద కొన్ని వందల మందిని పనిలో పెట్టుకుంది

కానీ ఆనంది కి ఒక్క జాబ్ కూడా రాలేదు. ప్రతి కంపెనీ దగ్గరకు వెళ్ళి తనకు ఉద్యోగం ఇవ్వమని బాగా ఉద్యోగం చేస్తాను అని ఎలాంటి ఉద్యోగం అయినా పరవాలేదు అని అడిగేది

ఎక్కడికి వెళ్ళినా అవమానాలు నిస్సహాయత తప్ప ఇంకేం ఎదురు అవ్వలేదు

ఇంకా ఎదురుచూసి ఎదురుచూసి ఇంటికి వెళ్లి అమ్మ దగ్గర బాధపడడం మొదలు పెట్టింది

ఆనంది తల్లి :

పోతే పోనీ తల్లి నువ్వు ఉద్యోగం చేసే పని ఏం లేదు లే మనకి ఇప్పుడు ఉన్న డబ్బులు సరిపోతాయిగా నువ్వు ఏం బాధ పడకు తల్లి త్వరలో నీకు పెళ్లి చేసి మంచి అయ్యా చేతిలో పెడతాం అంతా అవే సద్దుకుంటాయి

ఆనంది :

నువ్వు ఎలా అంటే అలా అమ్మ

వచ్చి రాని నవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది

స్వప్న తల్లి :

ఊపిరి తీసుకోలేనంత పనిలో సతమతం అయిపోతున్నావు ఇలా రా నేను భోజనం తినిపిస్తాను.

స్వప్న :

అమ్మ నా కంపెనీ లో మేనేజర్ పోస్ట్ కాలిగా ఉంది దానిని నేను ఆనందికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే తను పడే కష్టం నాకు కనిపిస్తుంది ఎక్కడ ఎక్కడో జాబ్ కోసం అడుగుతుంది అందుకే పోనీలే మన కంపెనీ లో జాయిన్ అయితే కొన్ని రోజులు ఉద్యోగం చేసుకుని సంతోష పడుతుంది ఎలాగా మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం కదా

పోస్ట్ ఇంకా కాలి అవ్వలేదు ఐదు రోజుల్లో అవుతాది అప్పుడు నేనే వెళ్ళి తనని జాయిన్ అవ్వమని చెప్తా సంతోషిస్తుంది..

స్వప్న తల్లి :

మంచి పని తల్లి బాగా ఆలోచించావు కాలి అయిన తరవాత వెళ్ళి చెప్పు సంతోషిస్తుంది.

స్వప్న :

సరే అమ్మ నేను పడుకోవడానికి వెళ్తున్నాను

మరుసటి రోజు :

ఆనంది తల్లి ఆనందితో కూతురు దగ్గరకు వచ్చి కౌగిలించుకొని నిన్ననే నీ పెళ్లి గురించి మాట్లాడుకున్నాము అప్పుడే నీకు మంచి సంబంధం వచ్చేసింది రెండు రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకొని పై దేశాలకు తీసుకొని వెళ్ళిపోతాడు అంట అని కడలిలో అలలా ఎగిసిపడుతు చెప్తుంది తల్లి

ఆనంది :

అంతా దేవుడు దయ అనుకొని ఏమి మాట్లాడకుండా ఆశలను ఆశయాలను కోరికలను అనగదక్కుకొని సరే అని చెప్పింది

రెండు రోజుల్లోనే పెళ్లి అని ఊరిలో అందరికీ అప్పుడే తెలిసింది స్వప్న తల్లికి కూడా ఆ విషయం త్వరగానే చేరుకుంది

వెంటనే స్వప్నకి స్వప్న తల్లి ఫోన్ చేసి అమ్మ స్వప్న ఈ మాట విన్నావా ! ఆనందికి పెళ్లి అంట రెండు రోజుల్లో పెళ్లి అయిన వెంటనే తను విదేశాలకు వెళ్ళిపోతుంది అంట

స్వప్న :

అయ్యయో దానికి అప్పుడే ఏం అంత వయస్సు అయిపోయింది అని పెళ్లి చేసుకోవడానికి

నేను మాట్లాడతాను తనతో అప్పుడే ఎందుకు అని నా కంపెనీ లో చేరమని ఏం అంటావు ?

స్వప్న తల్లి :

అయ్యో అలా చెయ్యకు అమ్మ

తనకి మళ్ళీ ఇంత మంచి సంబంధం రాలేదు అనుకో నువ్వే చెడగొట్టావు అని నిన్ను ఆడిపోసుకుంటారు వద్దమ్మ మనకి ఎందుకు చెప్పు తనని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండాలి అని ఉంటే ఉండనివ్వు నువ్వు ఏం తల దుర్చకు సరే నా...

స్వప్న ...ఎందుకు ఆనంది ఇలా చేస్తున్నావ్ నేను విన్నాను నీకు ఉద్యోగం చెయ్యడం అంటే ఇష్టం అని మరి ఎందుకు ఇలా చేస్తున్నావు ..

పోనీలే విదేశాలలో ఏదోక ఉద్యోగం నీకు దొరకాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

అంతా సక్రమంగా జరిగి అనుకున్నట్టుగానే ఆనందికి రెండు రోజుల్లో పెళ్లి అయిపోయింది విదేశాలకు కూడా వెళ్ళిపోయింది....

అందరూ ఆనంది జీవితంలో బయట ఆనందాలు మాత్రమే చూస్తున్నారు కానీ ఆనందికే తెలుసు తన జీవితంలో ఏం జరుగుతుంది అనేది

మొగుడు ప్రతి చిన్న విషయానికి దేనికి పనికి రావు అని ఉద్యోగం సజోగం లేదు అని తెలివితేటలు లేవు అని కానీ స్పోర్ట్స్ ఆడడం కూడా రాదు అని ప్రతి రోజూ ప్రతి నిమిషం ప్రతి క్షణం పుండు పై కారం జల్లినట్టు ఆడిపోసుకుంటు ఉంటాడు

అవి అన్నీ భరించి ఓపిక నశించిన ఆమె ఒక రోజు భర్త పై తిరగబడింది

" ఏం చదువు లేకపోతే దేనికి పనికి రామా "

మీకు తెలియదు అనుకుంటా నేను ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నాను సుమారు ఇప్పటికీ ఐదు లక్షలు సంపాదించాను అవును మీరు విన్నది నిజమే నేను సంపాదించగలను అని మీకు తెలియజేయడానికి ఇలా చేశాను ఇన్నాళ్లు ఇన్ని మాటలు పడ్డాను

మనసులో థాంక్స్ స్వప్న అని అనుకుంటాది

ఆ మాటలు విన్న ఆనంది భర్త ఆనందిని దగ్గరకు తీసుకున్నాడు

కొన్ని రోజుల ముందు..

స్వప్న ఆనందికి ఫోన్ చేసి తను చెయ్యాలి అనుకున్న చెప్పింది

ఆనంది ఏడుస్తూ నేను తప్పు చేశాను స్వప్న అన్నీ కంపెనీలు తిరిగేకన్న నీ దగ్గరకు వచ్చి ఉండవలసింది అని తన భర్త ఎలా తనతో ఉంటున్నాడు అనే విషయం చెప్తే అప్పుడు స్వప్న తనకు ఉన్న ఆన్లైన్ బిజినెస్ ను ఆనందికి అప్పజెప్పేసింది

అలా తను సంపాదించడం మొదలు పెట్టింది...

ఇలా వారి జీవితాన్ని సరిదిద్దింది స్వప్న...

నీతి :

మన జీవితాన్ని దేవుడు ముందే రాశాడు అని జరిగేదేదో జరిగిపోతుంది లే అని ఏమి చెయ్యకుండా కూర్చుంటే ఆనంది జీవితంలా ప్రతి ఒక్కరి చేత మాటలు పడ్డాలి ఒక్కరి మీద ఆధారపడ్డలి

దేవుడు ఉన్నాడు అని మన ప్రతి విషయంలో మనకి తోడుగా ఉంటాడు అని తెగించి అడుగు ముందు వేసి భారం అంతా ఆయన మీద వేసి మనల్ని మనం ముందుకు తోస్తు ఉంటే పనులు వాటి అంతట అవే జరుగుతాయి

సంకల్ప బలం ఉండి మనసుని ఇంద్రియాలకు లోనవకుండా ఉంచుకొగలిగితే జీవితంలో ఏదైనా సాధ్యమే

ఏ పని అయిన సరే చిన్నతనంలో మొదలు పెడితే ఆ పనులు జీవితానికి పాఠాలుగా మారతాయి మీ పిల్లలకు నమ్మకాలని నేర్పించండి అంతే కానీ ముడ నమ్మకాలని నేర్పించకండి అవి కొంతమందిని ఆనందిలా మారుస్తాయి లేకపోతే స్వప్నలా మారుస్తాయి అనుకున్నవి సాధించగలిగే శక్తి సామర్ధ్యాలను ఇస్తాయి....

ఒక్కసారి ఆలోచించండి.. మీ పిల్లలను ఎప్పుడూ రాజు/రాణిలా చూడండి.మీరు చెప్పే మాటలు వారి జీవితాల మీద చాలా ప్రభావం చూపిస్తాయి ...

చిన్న మాట :

కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే క్షమించండి దేవుడిని నమ్మడం తప్పు కాదు కానీ ప్రతి విషయానికి ఆయనే కారణం అనడం తప్పు అని నా ఉద్దేశ్యం

ఎందుకు ఇలా రాశాను అంటే నమ్మకాలను సైతం మూఢ నమ్మకలుగా మారుస్తున్నారు కొంత మంది జనం అలా జరగకూడదు అని ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టీ చుద్దొదు అని తెలియజేయడం కోసం మాత్రమే ఈ చిన్ని ప్రయత్నం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గెలుపును చేవి చూసి ఉంటారు ఓటమిని చెవి చూసి ఉంటారు వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నావరే గొప్పవారు.


కథ ముగిసింది



Rate this content
Log in