STORYMIRROR

Ambica Lakshmi

Children Stories Tragedy Children

4  

Ambica Lakshmi

Children Stories Tragedy Children

చిన్నారి సీతాకోక చిలుక

చిన్నారి సీతాకోక చిలుక

2 mins
646

చిన్నారి సీతాకోక చిలుక

ఒక ఊరిలో పెద్ద సీత కొక చిలుకల గుంపు నివసిస్తూ ఉండేది

విశేషం ఏమిటంటే అవి అన్నీ ఒకే రంగులో ఆకారంలో ఉండేవి చాలా అందంగా చూసిన వెంటనే ఆకట్టుకునేలా ఉండేది వాటి రూపం


ఒక రోజు బుల్లి సీతాకోక చిలుక పుట్టింది కానీ ఆ సీతాకోక చిలుక విటికన్న చాలా భిన్నంగా ఉంది


ఒక రెక్క పెద్దదిగా ఒక రెక్క చిన్నగా ఒక రెక్క తెల్లగా మరొక రెక్క నల్లగా ఉండి పుట్టింది

అది చూసిన మిగిలిన సీతాకోక చిలుకలు దానిని దగ్గరకు రానివ్వకుండా హేళన చేస్తూ ఆట పట్టిస్తూ ఉండేవారు


బాధ తట్టుకోలేక అది వారి నుంచి బయటకు వచ్చేసింది

బయట మనుషులతో జీవనం సాగించడం మొదలు పెట్టింది తనకు నచ్చిన చెట్టు దగ్గరకు వెళ్ళి తేనె తాగడం నచ్చిన చెట్టు మీద సేద తీరడం చెయ్యడం మొదలు పెట్టింది

సరదా సరదాగా గడుపుతూ ఉండేది

ఒక రోజు దురదృష్టవశాత్తు ఆ సీతాకోక చిలుక ఒక చిన్న పిల్ల చేతికి చిక్కింది

నన్ను వదులు వదులు అని అరుస్తున వినిపించుకోకుండా ఆ పిల్ల దాని రెండు రెక్కను విరిచి పడేసింది

దానితో ఆ సీతాకోక చిలుక చచ్చిపోయింది.

కానీ దానికి తెలియని విషయం ఏమిటంటే అది బయటకు వచ్చిన ఆ గుంపులో పుట్టిన ప్రతి సీతాకోక చిలుకా చిన్న పెద్ద నలుపు తెలుపు రెక్కలతో పుట్టాయి

గుంపులో వారు ఆ సీతాకోక చిలుకలను హేళన చెయ్యడం మానేసి వాటిని చెరదియ్యడం మొదలు పెట్టాయి

ఈ కథలో తప్పు ఎవరిది హేళన చేసిన గుంపుదా లేక బయటకు వచ్చేసిన సీతాకోక చిలుకదా

మీరు ఏం అనుకుంటున్నారు మీ మనసుకు చెప్పండి ??


నీతి :

నేను ఏం అనుకుంటున్నాను అంటే

ఎవరో ఏదో అన్నారు అని నువ్వు నీ గుర్తింపుని మార్చుకోకుడదు వారి నుంచి వేరుగా వెళ్ళే పని లేదు నీ బ్రతుకు నువ్వే బ్రతకాలి నలుగురి కోసం బ్రతకకుడదు జీవితంలో సహనం చాలా ముఖ్యం కొన్ని రోజులు ఆగి ఉంటే వారితో కలిసి సంతోషంగా ఉండేది ఆ సీతాకోక చిలుక

మనిషి (కథలో సీతాకోక చిలుక ) గాలిపటం లాంటివాడు గాలి ఏటు వేస్తే అటు తిరిగిపోతూ ఉంటాడు

వాటిని వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే జీవితం సంతోషంగా సుఖంగా సాగుతుంది



Rate this content
Log in