STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

4  

Harika Addala

Children Stories Inspirational Children

బీర్బల్ భార్య సమయస్ఫూర్తి

బీర్బల్ భార్య సమయస్ఫూర్తి

2 mins
0

అక్బర్ ఆస్థానంలో చతురుడు, సమయస్ఫూర్తి గల బీర్బల్ ఉన్నాడు. ఒకరి బీర్బల్ ను పిలిచి ఒక వరం రోజుల్లో నాకు ఎద్దుపాలు తెప్పించు, లేనిచో కారాగారం తప్పదు అన్నాడు.

"ఎద్దుపాలు", అదీ వారంరోజుల్లో ఎలా సాధ్యం. సాహసించి అక్బర్ తో చెప్పే ధైర్యం లేదు, నీరసంగా ఇంటిముఖం పట్టాడు బీర్బల్, ఎండా మండిపోతుంది. గొంతు దాహంతో పిడచ కట్టుక పోతుంది. బీర్బల్ ఇల్లు చేరి మంచి నీళ్లు తాగి, కూర్చున్నాడు. భార్య వచ్చి ఏమండి, ఏంటి అలా ఉన్నారు అని అడిగింది. ఆలోచనలో ఉన్న! ఎలా చెప్పను అక్బర్ చక్రవర్తి వారం రోజుల్లో "ఎద్దు పాలు" తెమ్మన్నాడు లేనిచో ఖైదు చేస్తానన్నాడు. అంటూ భార్యతో అసలు విషయం చెప్పాడు. 

భార్య ఆశ్చర్యపడి ఏంటి "ఎద్దు పాలు" కావాలంటా? అని ఆలోచించింది. బీర్బల్ భార్య సమయస్ఫూర్తిగా ఆలోచించగలదు, బీర్బల్ కూడా ఎలాంటి సమస్యనైనా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటాడు. 

బీర్బల్ భార్య అలోచించి, "మీరు బయటకు రాకండి. దైర్యంగా వుండండి. ఎద్దు పాలు నేను తెస్తాను" అంటూ బీర్బల్ తో చెప్పి ఇడిచిన బట్టలు ఒక మూట కట్టుకొని బయలుదేరింది. అంతఃపురానికి వెళ్ళేదారిలో ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మురికి బట్టలు ఉతుకుతూ ఏడుస్తుంది పెద్ద పెట్టున.

అంతఃపురానికి వెళ్తున్న రాజభటులు ఆమెను చూసి చెరువు దగ్గరకు వచ్చి "ఎమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏమి కష్టం వచ్చింది? మాతో చెప్పు" అని బీర్బల్ భార్యను అడిగారు. "అయ్యా మావూరి మునసబు కొడుక్కి మగ పిల్లాడు పుట్టాడు ఆ మైల బట్టలు ఉతుకుతున్నాను, ఎంత ఉతికినా తరగడం లేదు" అంటూ పెద్ద పెట్టున రోదించింది బీర్బల్ భార్య.

ఆశ్చర్యంగా చూశారు భటులు. ఆమెను అంతఃపురానికి తీసుకునివెళ్ళారు. మహారాజా! "మునసబు కొడుక్కి మెగా పిల్లాడు పుట్టాడట ఆ బట్టలు ఉతకలేక ఏడుస్తున్నానని అంటుందీమె" అని అంటూ ఆమెను రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు రాజభటులు. రాజు భిన్నుడై ఏమ్మా "మగ వాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా? ఏంది? ఏమిటి నాటకం" అని గద్దించారు అక్బర్.

మహారాజా! ఎద్దు, పాలు ఇవ్వగలేనిది మగాడు పిల్లల్ని కంటే తప్పేంటి అని అక్బర్ తో అంది బీర్బల్ భార్య గడుసుగా..

చక్రవర్తి అక్బర్ కు తన తప్పేంటో తెలిసింది. బీర్బల్ విషయంలో తను చేసిన పొరపాటు అర్ధమైంది. వెంటనే భటులతో అక్బర్ చక్రవర్తి మీరు వెళ్లి బీర్బల్ ని తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపించాడు.

బీర్బల్ భార్య "క్షమించండి నేను బీర్బల్ భార్యనే అయితే ఎద్దు పాలు తెమ్మన్నారు. ఆయన బెంగపెట్టుకున్నారు. అది  చూడలేక మీకు నిజం తెలియజేయాలని ఇలా వచ్చాను నేను బీర్బల్ భార్యను అంటూ తెలియజేసింది.

అక్బర్ ఆవిడ చతురతకు ముగ్దుడై బీర్బల్ దంపతులను మెచ్చుకొని సన్మానించాడు. బీర్బల్ ఆయన భార్య సంతోషంగా ఇంటి ముఖం పట్టారు 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్