స్వాతి సూర్యదేవర

Children Stories Drama Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Children Stories Drama Inspirational

అమ్మకి తోడుగా...

అమ్మకి తోడుగా...

4 mins
419


"ఏంటి వాణి ఇది గంట నుండి ఒకటే వాదన.. నీతో నా వల్ల కావట్లేదు...రోజు ఇదొక గోల ఐపోయింది నీతో.."అంటూ గట్టిగా అరుస్తున్నారు శ్రీరామ్ తన భార్యపై...

"ఆ మాట మీరు కాదు నేను అనాలి...ఎన్నిరోజులైంది మీరు ఆఫీస్ నుండి తిన్నగా ఇంటికి రాక...మూడు నెలల నుండి చూస్తున్న రాత్రి ఎనిమిది దాటే దాకా బయటే స్నేహితులంటూ ఉండిపోతున్నారు..రాగానే తిని వెంటనే పడుకుంటున్నారు..ఇక పొద్దున్నే ఒకటే హడావిడి..అసలు మీరు నాతో ,పిల్లలతో గడిపి ఎంత కాలమైందో తెలుసా...రోజు పిల్లలు నాన్న ,నాన్న అంటూ మీ కోసం చూసి చూసి నిద్రపోతున్నారు...ఇలా అయితే ఎలా అండి...కనీసం ఇవ్వాళ ఆదివారం ఇవ్వాళ కూడా ఇంట్లో ఉండకుండా..మాతో గడపకుండా ఫ్రెండ్స్,పార్టీ అంటూ వెళ్లిపోతున్నారు...కొంచెం కూడా మీకు నా గురించి పట్టదా.. ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో తెలుసా మీకు.."

"ఒంటరీగానా..ఎక్కడున్నావు..నీతో పాటు పిల్లలు ఉన్నారు..నీ కాలక్షేపాలు నీకు ఉన్నాయి కదా...ఎం తక్కువయ్యాయి అని నీకు ఒంటరిగా అనిపిస్తుంది."

"మీకు అలానే వుంటుంది...అయిన మునుపులేని కొత్త సరదాలు ,స్నేహితులు మీకు ఎక్కువైపోయాయి లెండి...అందుకే నన్ను దూరం పెడుతున్నారు.."

"అవును అవే ఎక్కువయ్యాయి అయితే ఇప్పుడు ఏమంటావు..హ.."

"ఏంటండి మీరు...ఇలా వాదిస్తున్నారు..అరే ఇంట్లో వుండండి అన్నదానికి ఇందాక నుండి ఒకటే రాద్ధాంతం చేస్తున్నారు..."

"సరే ఇంట్లోనే ఉంటాను చాలా..అసలు ఇంట్లో ఉండి నేను ఎం చెయ్యాలి..చెప్పు "అని చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్..

శ్రీరామ్ విసిగించుకోవడంతో వాణి కూడా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయింది...

కానీ గదిలోకి వచ్చిన శ్రీరామ్ మాత్రం అటు ఇటూ తిరుగుతూ.....లొలొపలే వాణిని తిట్టుకుంటున్నాడు. ఈ లోపు ఆ రూమ్ కి కాస్త పక్కాగా పిల్లలు మాట్లాడుకుంతుంటే వారి మాటలలో డాడీ అని వినిపించడంతో ఏంటా అని కిటికీ దగ్గరకి వెళ్ళి వారి మాటలు వింటూన్నాడు..

బన్నీ : అక్క డాడీ ఎందుకు మమ్మీ ని తిట్టాడు..వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు..అని తన పదేళ్ల అక్కని అడిగాడు బన్నీ

స్వీటీ : డాడీ బయటకు వెళ్తాను అంటే మమ్మీ వద్దు అంటుంది బన్నీ అందుకే డాడీ ,మమ్మీ ని అరుస్తున్నారు..

బన్నీ: ఎందుకు వద్దు అంటుంది అక్క

స్వీటీ: ఎందుకు ఏంటి బన్నీ..డాడీ కొన్ని డేస్ నుండి ఇంటికి లేట్ గా వస్తున్నారు కదా అందుకు

బన్నీ: వస్తే ఏమైంది అక్క మమ్మీ కి ఎందుకు కోపం వస్తుంది

స్వీటీ: బన్నీ మనం రోజూ ఉదయాన్నే స్కూల్ కి వెళ్లిపోతాం. మళ్ళీ సాయంత్రం వస్తాం ,మళ్ళీ కొద్ధిసేపు వుండి ట్యూషన్కి వెళ్లిపోతాం,రాగానే తినేసి నిద్రపోతాం,మనలాగే డాడీ కూడా అంతే..మన ముగ్గురం వెళ్ళిపోతే పాపం మమ్మీ ఒక్కతే కదా ఇంట్లో ఉండేది..మనకి అన్ని చేసిపెట్టేది..మనకి మమ్మీ,డాడీ తోడు వున్నారు అని అనిపిస్తుంది కాబట్టి మనకి ఎం అనిపించట్లేదు ,డాడీ కి కూడా బోలెడు మంది ఫ్రెండ్స్ వున్నారు కాబట్టి డాడీ కి కూడా ఒంటరిగా అనిపించట్లేదు కానీ ముమ్మీకి మన ముగ్గురం తప్ప ఎవరూ వున్నారు చెప్పు అందుకే మమ్మీ కి మనం పట్టించుకోకపోయేసరికి భాదేసింది..

బన్నీ: మరి మనం స్కూల్ కి,డాడీ ఆఫీస్ కి వెళ్లకపోతే ఎలా అక్క..

స్వీటీ: బన్నీ రోజూ మనం ఖచ్చితంగా వెళ్ళాలి అది అమ్మకి కూడా తెలుసు కానీ ఈ రోజు సండే మనకి సెలవు కూడా..కానీ ఈ రోజు నువ్వు నేను ఇంట్లొ ఉన్నా పొద్దున బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నువ్వు బొర్ కొడుతుంది అని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఆడుకొని ఇప్పుడే ఇంటికి వచ్చావు..మళ్ళీ వెళ్తా అంటున్నావు....నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఇప్పుడే వచ్చాను...మళ్ళీ మనం ఈవెనింగ్ ట్యూషన్ కి వెళ్లిపోతాం..మనలాగే డాడీ కూడా ఇవ్వాళ చాలా లేట్ గా లేచారు..వెంటనే మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటున్నారు...కాని మమ్మీ కి ఎవరున్నారు ఫ్రెండ్స్ పాపం మమ్మీ కి అన్ని మనమే కదా..మరి కనీసం సండే రోజు కూడా మమ్మీ తో ఉండకుండా బయటకు వెళ్లిపోతుంటే పాపం మమ్మీ కి భాధ అనిపించదా..నువ్వు చెప్పు....

బన్నీ: నిజమే అక్క పాపం మమ్మీ ఇప్పటికే బాధపడుతుంది మళ్ళీ డాడీ కూడా తిట్టేసారు పాపం ఇంకా బాధపడుతుంది కదా...అయిన డాడీ మనతో ఇంతకుముందు ఆడుకునేవారు కాబట్టి మనం కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళం,ఈవినింగ్ కూడా డాడీ అందరిని బయటకు తీసుకెళ్లేవారు చాలా హ్యాపీ గా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు డాడీ వుండట్లేదు..మనం హ్యాపీగా లేము..పాపమ్ మమ్మీ అయితే ఇంకా కదా..

స్వీటీ....అవును రా...ఎం చేద్దాం..మమ్మీ చెప్పిన డాడీ వినట్లేదుగా...అని ఇద్దరు దిగులుగా కూర్చున్నారు...

        వాళ్ళ మాటలు విన్న శ్రీరామ్ కి కూడా గత కొంతకాలంగా తన ప్రవర్తన గుర్తొచ్చి చాలా గిల్టీగా అనిపించింది..

శ్రీరామ్ పాపం వాణి బాధలో కూడా న్యాయం ఉంది కదా...నేనే వీళ్ళని ఇలా వదిలేసి నా సరదాలు చూసుకున్నాను..కానీ ఏ రోజు నోరుతెరిచి వాణి తను ఏది అడగలేదు ,పిల్లలు కూడా ఇది కావాలి అని అడగరు.. అలా తను అన్ని చూస్కునేది కానీ నేను తననే విస్మరించాను...తప్పు నాదగ్గర పెట్టుకొని పాపం తనని అరిచేసాను...ఎంత భాధపడుంటుందో....రోజు వంటరిగా ఇంట్లో ఒక్కతే ఉంటుంది మేము ఉన్నతసేపు పనే సరిపోతుంది పాపం ,పని అయ్యాక తనతో ఒక్కమాట మాట్లాడడానికి కూడా ఎవరం వుండము,అలా తనతో ఉండేది మాట్లాడేది ఈ ఒక్కరోజే కదా...ఈ రోజు కోసం తాను వారం అంత ఎదురుచూస్తుంటుంది కానీ ఇవ్వలేమో ఇలా...అని ఒక్కక్షణములో భాధ అనిపించగానే వెంటనే హాల్ లోకి వచ్చి వాణి ని చూసాడు...సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది...అలా ఉన్న తన కనురెప్పల మాటున ఉన్న తడి తెలుస్తూనే ఉంది...బాధగా అనిపించి వెళ్లి పక్కన కూర్చొని తన చేతిని ,తన రెండు చేతుల మధ్యకి తీసుకొనే సారీ.. వాణి చాలా హర్ట్ చేశా కదా నిన్ను...

వాణి కళ్ళు తెరిచి చూసి ఎం మాట్లాడకుండా తలదించుకుంది..

శ్రీరామ్ : వాణి ప్లీజ్ నాతో మాట్లాడవా...సారీ రా,నేను నిన్ను చాలా ఇగ్నోర్ చేసాను..నన్ను క్షమించవా అని సున్నితంగా తన చేతిని నొక్కాడు..

వాణి :అయ్యో అదేంటి అండి..క్షమించమనెంత తప్పు మీరేం చెయ్యలేదు..

శ్రీరామ్ : నేను ఎం చేసానో నాకు తెలుసు వాణి...నా గురించి నేను ఆలోచించుకున్నను కానీ నీ గురించి క్షణము కూడా ఆలోచించలేకపోయాను...పిల్లలు చెప్పిందాక కూడా నాకు నా తప్పు తెలియలేదు....

వాణి: కంగారుగా పిల్లలా... అని వాళ్ళు మిమ్మల్ని ఎమన్నా అన్నారా...ఎమన్నా తప్పుగా మాట్లాడారా....నా వల్ల మీరు వాళ్ళ ముందు తక్కువ కావడం నేను భరించలేను అండి..ఇప్పుడే వాళ్ళని గద్ధిస్తాను ఉండండి అని పిల్లలు దగ్గరకి అని లేవబోయింది...

శ్రీరామ్: ఆగు వాణి పాపం వాళ్ళు నన్ను ఎం అనలేదు అని బయట కూర్చొని పిల్లలు మాట్లాడుకున్నది అంత చెప్పాడు..

అంతా విన్న వాణికి చాలా సంతోషంగా అనిపించింది...చిన్న వయసులోనే వాళ్ళు తన గురించి ఆలోచించినందుకు...

వాణి: నిజంగా మన పిల్లలు బంగారాలు అండి...

శ్రీరామ్: నిజమెనోయ్...అప్పుడే తప్పొప్పుల గురించి ఆలోచిస్తున్నారు..అంతా వాళ్ళ అమ్మ పెంపకం ,ఈ అమ్మ మీద వాళ్ళకి ఉన్న ప్రేమ అని వాణి బుగ్గ మీద వేలితో చిటిక వేసాడు నవ్వుతూ...

వాణి సిగ్గుపడుతూ..పొండి అంటుంటే..అదేంటి వాణి ఇప్పటిదాకా ఇంట్లో వుండట్లేదు అని తిట్టేసి తీరా నేను రియలైజ్ అయ్యాక ఇప్పుడు పొమ్మంటావు...అనగానే ఒక్క క్షణం శ్రీరామ్ ని కోపంగా చూసి అంతలోనే హాయిగా నవ్వేసింది వాణి...తనతో పాటే శ్రీరామ్ కూడా..ఇంతలో పిల్లలు రావడంతో దూరం జరిగి ఇద్దరు, ఇద్దరిని దగ్గరికి తీసుకొని ముద్దు చేశారు...

బన్నీ: డాడీ అప్పుడే మమ్మీ నువ్వు కాంప్రమైజ్ అయ్యారా..

శ్రీరామ్: హా నాన్న...మరి మా స్వీటీ,బన్నీ లు గుడ్ చైల్డ్రన్ కదా అందుకే వాళ్ళ డాడీని తన తప్పు తెలుసుకొనేలా చేశారు..

స్వీటీ.:  అంటే

శ్రీరామ్: అంది అంతేలే బంగారం మీరు ఇద్దరు వెళ్లి త్వరగా రెడీ అవ్వండి మనం బయటకు వెళదాం...

బన్నీ: నిజంగానా డాడీ..

వాణి: హ.అవును నాన్న ...మీరు వెళ్లి ఫాస్ట్గా ఫ్రెష్ అవదురు పదండి అంటూ శ్రీరామ్ వైపు నవ్వుతూ చూసి వాళ్ళని లోపలికి తీసుకువెళ్లింది...

లోపలికి వెళ్తున్న వాళ్ళని చూస్తున్న శ్రీరామ్ ...ఒక్కోసారి పిల్లలే పెద్దవాళ్ళకంటే బాగా ఆలోచిస్తారు ,పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్ని మాటలతోనే పాఠాలు చెప్తారు అనిపించింది...

                   



Rate this content
Log in