వికసించిన కుసుమాలు...!!
వికసించిన కుసుమాలు...!!

1 min

298
కొమ్మ కొమ్మలో పూసేటి పూరెమ్మని
మలినం లేని మాలికని పురేకుని
అలంకరణలో అందాన్నిచ్చే పూబంతిని
గుడిలోని మాలని మంత్రపుష్పాన్ని
మగువ మనసులు దోచే జడలోని మల్లెని
సుగంధాలు వెదజల్లే కుసుమాని
మనసును రంజింప చేసే విరజాజిని
వలపు తోటలో విరిసిన పూబోనినీ
ప్రేమకు సాక్షిగా నిలిచిన రోజాని
పూటలో రాలిపోయి వాడిపోయే పుష్పాన్ని
అయినా కూడా ఒక్కపూటైనా
నీఆకలి తీర్చే భాగ్యాన్ని పొందిన సుమాని
జపకుసుమాని.... మకరందాన్ని...!!
✍️ జ్యోతి మువ్వల.