STORYMIRROR

Dinakar Reddy

Children Stories Children

4  

Dinakar Reddy

Children Stories Children

సముద్ర తీరాన బాల్యం

సముద్ర తీరాన బాల్యం

1 min
245

పాఠశాల లేకపోతే

సాగర తీరానికి పరుగు

జాలరి కుటుంబంలోని నలుగురు పిల్లలకూ

అలలే ఆటవిడుపు


పెద్ద పడవల్లో చేపల వేట

చూసి వచ్చింది ఒక ఆలోచన

నేర్పుగా పిల్లాడు చేసాడొక చిన్ని పడవ

తెరచాపతో కూడా కదిలిందది 


అలలు దాన్ని నెడుతూ

ముందుకూ వెనక్కూ కదిలిస్తుంటే

పిల్లల ముఖాల్లో ఆశ్చర్యం

చప్పట్లు కొడుతూ ఒకరు

చాలు చాలంటూ ఒకరు

సమయాన్ని తోసి గడిపారు 


చేప పిల్లలు

నత్త గుల్లలు

శంఖాలు ఏరడం

పర్యాటకులకు వాటిని అమ్మటం


సముద్ర తీరాన బాల్యం

రోజూ కొత్త అలలా అనిపించింది...


Rate this content
Log in