Phanikiran AK

Others

4.4  

Phanikiran AK

Others

రంగులతో నిండేదెపుడో?

రంగులతో నిండేదెపుడో?

1 min
329


కరోనా వచ్చి...

కంటిముందు నిలిచింది.

చేతిలోని కొలువు....

చేజారి పోయింది.

నోటికాడి కూడు ...

కనుమరుగైపోయింది.

కళకళలాడే బ్రతుకులు.... 

కళ వెల పడెను .

కూటికోసం కోటివిద్యల... 

నానుడి నిజమాయెను.

చదువు చెప్పు గురువులు...

కూలీలుగా మారే.

కూలి బడుగు జీవులు... 

మృత్యులోగిలి చేరె.

రెక్కలొచ్చిన పక్షులు ...

రెక్కలు తెగి డీలాపడె .

బ్రతుకు బండి నడప.... 

దొరికిన పని బాట పట్టె.

ఏనాటికో విముక్తి?

ఎటు సాగునో 

మానవ స్థితి.

తిరిగి బ్రతుకు చక్రం...

దారిన పడేదెపుడో?

ఆశల చిత్రం...

రంగులతో నిండేదెపుడో?

***************


ఫణికిరణ్. 


Rate this content
Log in