ప్రకృతి సేద్యం
ప్రకృతి సేద్యం
1 min
10
కరుణించిన వరుణుని రాకతో,
కాలంతో పోరాడిన ప్రజలకు శాంతి.
ముక్కోపైన భానుని వేడికి శిరస్సు వంచిన భూమి,
జలజల పారుతున్న వరుణుని జలధారలతో హాయి పొందింది.
36 తిప్పలు పడితే, 36 బస్తాల పంట పండెను.
ఎండిన పొలాలకు జీవం పోసిన ఆ ప్రవాహం,
రైతు మనసులో ప్రశాంతతను నింపింది.
ప్రకృతిని ప్రేమించిన ఆ రైతు,
తన శ్రమ ఫలితం చూసి సంతోషంతో పరవశించాడు.
_____________________________
