STORYMIRROR

రాచర్ల నరేష్ బాబు

Others

4  

రాచర్ల నరేష్ బాబు

Others

ప్రియమైన మార్జాలమా

ప్రియమైన మార్జాలమా

1 min
14

నీ అమాయకపు చూపు, నా మనసు దోచే మాయ.

ఆహారం కోసం నీ తపన, ఎంతో అన్యోన్యంగా ఉంది.

ఎక్కడ చూసినా బుల్లి బుల్లి అడుగులతో, ఇల్లంతా గందరగోళం లేపుతావు, అయినా ముద్దుగానే! ఏమి చెప్పాలి నీ లీలలు, ఓ నా ప్రియమైన మార్జాలమా! ఎక్కడపడితే అక్కడ ఏమేమో చేస్తావు, నీ దెబ్బకు మూషిక సముదాయం పరారవుతుంది, అదంతా నీ సహజ స్వభావం, నా పెంపుడు ప్రాణమా.

అమ్మో! నీ ఆహారపు కోరికలు ఎంతో వింతగా ఉన్నాయే! నీకోసం ఎదురుచూస్తున్న పెరుగన్నాన్ని కాదంటావు, ఏవేవో మాంసాహారాల మీదనే నీ దృష్టి. అయినా, నీ ప్రతి చేష్టలోనూ, నాకెంతో ప్రేమ! 

_____________________________


Rate this content
Log in