నా ప్రాణమా
నా ప్రాణమా
1 min
11
మేలుకోరా నా ప్రియమైన, మేలుకో!
నీ ఆకలికి, నీ బాధకు నేను అండగా నిలబడనా?
ఖచ్చితంగా నిలబడతాను, నీ దుఃఖం తీర్చుకో.
నా సర్వస్వం నీకే, నా ప్రాణం నీకే,
నాకు ప్రతిఫలం వద్దు, నీ సంతోషమే నాకు ప్రాణం.
ఎందుకంటే నీవే నా లోకం, ఆ విషయం తెలుసుకో.
ఎందుకు నువ్వు నా త్యాగాన్ని స్వీకరించడం లేదు?
నేను నీకు అండగా పనికిరానా?
నీకు కూడా నేను లోకువనా?
ఓ నా ప్రాణమా, స్వీకరించవా ఈ ప్రేమను?
చేర్చుకోవా నన్ను నీలో?
__________________________
