నా సుందర అవని
నా సుందర అవని
1 min
304
నేనడిచే పుడమి
అద్భుతాల అవని
నను మోసే జనని
సౌందర్యాల సిరి
రవి కాంతుని కిరణాల..
వెలుగు ఝరి ఒకదరి
వెన్నెల కాంతులు వెదజల్లే ..
వని, ఆ దరి కాంచు ఓ పరి
విశ్వాన వెలుగొందే నీలమణి
ప్రకృతి అందాలను దాచిన గని
సురలను మురిపించిన వయ్యారి
మనసుల దోచే సొగసరి
అంతుచిక్కని అందాలతో...
శరములు సంధించే గడుసరి
గ్రహ సీమల నడుమ వెలుగొందే
వన్నెల విరి
విశాల విశ్వాన నిలిచే
అపురూప చిత్ర సుందరి
నాయీ ధరణి తల్లి
చాలదా ఈ జన్మ ఆమె ఒడిని ..
పులకించిన ఓ పరి.
నిరాటంకంగా చేరదా ...
మన ఆత్మ మోక్ష దారి.
***********
(నాసా వారి భూగ్రహం చిత్రరాజాలు)