STORYMIRROR

Phanikiran AK

Others

4  

Phanikiran AK

Others

మగువా

మగువా

1 min
342

మగువా ...


కన్నావా ఉత్సవాలు


విన్నావా శుభాకాంక్షలు


ఒక్కరోజు గౌరవాలు


మిగిలిన రోజులలో తీరని గాయాలు


పసిపాపగా ఛిద్రమౌతుంటే .....


చూపు మరల్చుకునే కఠిన హృదయాలు


కౌమారంలో కాటేసినా ...


కాసేపు ఎలుగెత్తి అరిచి


ఆపై నిలిచే కర్కశ కంఠాలు


ఆధునికతలో అడుగుపెట్టినా


వీడని ధనదాహాలు


నీ బ్రతుకును నరకం చేసినా


కరుకుగా కదలని చట్టాలు



మృగాళ్లే కానక్కర్లేదు


బ్రతుకును ఛిద్రం చేయ


మగాడినన్న అహం చాలు


మనసును ముక్కలు చేయ



శరీర గాయానికి గురుతు మచ్చ అయితే


మానసిక గాయానికి సాక్ష్యం


నిస్తేజమైన బ్రతుకు



దినాలతో పనియేల


ఉత్సవాలతో నీకేల


నిత్య౦ జరిగే పోరాటం


ఈ జీవన హేల



వేటగాడి వేటుకి బలయ్యే గీతిక


కాకూడదు నీ రాత ఇక



సహనం హద్దుని చెరిపి


శంఖం పూరించి కదిలావా


కాదా ఈ భువనం నీ పాదాక్రాంతం .


**********%%%%%%************


ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు 


Rate this content
Log in