ఆమ్మ
ఆమ్మ
1 min
295
ఆకాశాన్ని అడిగితే చెప్పింది
అమ్మ ప్రేమ తన కంటే విశాలమని
సాగరాన్ని అడిగితే చెప్పింది
అమ్మ మనసు తన కంటే లోతు అని
కొండ తేనెను అడిగితే చెప్పింది
అమ్మ మమత తన కంటే తియ్యనైనది అని
సరాగాల కోయిలను అడిగితే చెప్పింది
అమ్మ పిలుపు తన పాట కంటే మధుర మని
కొవ్వొత్తిని అడిగితే చెప్పింది
అమ్మ త్యాగం తన కంటే కొటిరెట్లు ఎక్కువని
నేల తల్లిని అడిగితే చెప్పింది
అమ్మ అంటే నే ఓర్పు అని
ఓర్పు అంటేనే అమ్మ అని...
... సిరి ✍️
