STORYMIRROR

Dinakar Reddy

Children Stories Fantasy

3  

Dinakar Reddy

Children Stories Fantasy

జాణవులే నెరజాణవులే

జాణవులే నెరజాణవులే

1 min
200

మహారాజా! ఈ కృష్ణ కుమారుడు నిన్న రాత్రి నన్ను బలాత్కరించబోయాడు. నాకు న్యాయం చేయండి మహారాజా అన్న రాజ నర్తకి మాటలు విని రాయల వారు కృష్ణ కుమారునికి శిక్షను విధిస్తాడు. కానీ న్యాయం కృష్ణ కుమారుని వైపే ఉందని బలంగా నమ్మి శిక్ష అమలు కాకుండా మారు వేషంలో వెళ్ళి రక్షిస్తాడు.


మోహినీ పద వెళ్దాం అంటూ కృష్ణ కుమార్ అడవిలోకి పరుగు తీస్తాడు.

పోలీసు కానిస్టేబులు ఒక చెలికత్తెతో కాల యంత్రం గురించి చెప్పడం విని అది ఉన్న చోటు తెలుసుకుంటుంది రాజ నర్తకి.


రాజ నర్తకి పగ తీర్చుకునే మార్గం ఆలోచిస్తుంది. ఆమె ఒక సైనికాధికారి సహాయంతో అడవిలో ఉన్న కాల యంత్రం ఉన్న చోటుకు చేరుకుంటుంది. 


మిత్రమా! నాకోసం ఈ కాల యంత్రాన్ని కాల్చి బూడిద చేయి అని రాజ నర్తకి అతడిని కోరుతుంది.


కానీ అలా చేస్తే వాళ్లెప్పటికీ మన రాజ్యంలో ఉండిపోతారు. దాని వల్ల నీకేం లాభం? అని అతను ప్రశ్నించాడు.


రాజ నర్తకి నవ్వుతూ ఆ కృష్ణ కుమారుని అతని ప్రేయసిని విడదీసి ఆ మోహినిని నా దాసిగా చేసుకుంటాను అంటూ వికృతంగా నవ్వింది.


Rate this content
Log in