M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

సీమరేగిపండు....నాటురేగిపండు

సీమరేగిపండు....నాటురేగిపండు

2 mins
454


   సీమరేగిడి పండు...నాటు రేగిడి పండు


   నీరజకి ఆపిల్ పండ్లు చాలా ఇష్టం, అలాగే ఇంగ్లీష్ లో మాట్లాడటమన్నా చాలా ఇష్టం. నీలిమ తాతయ్యకి నాటు రేగిపండ్లు తినడం ఇష్టం,అలాగే అతనికి అచ్చ తెలుగులో మాట్లాడటం అంటే చాలా చాలా ఇష్టం.నీరజ ఉదయం మధ్యాహ్నం సాయింత్రం పూటకో ఆపిల్ తింటుంటే, తాతయ్య గంటకో రేగుపండు చొప్పున పోటీ పడి మరీ తింటుండేవారు. ఆపిల్ తిన్నప్పుడల్లా "సీ తాతయ్యా! ఐ యాం ఈటింగ్ ఆపిల్, ఏ కాస్ట్లీ ఫ్రూట్ అండ్ హెల్తీ ఫుడ్, యూ ఆర్ ఈటింగ్ కంట్రీ ఫ్రూట్ అండ్ లోకాస్ట్ ఫుడ్" అని సరదాగా తాతయ్యను ఆటపట్టిస్తుండేది నీరజ."అవును మనవరాలా!నాకు అతి మధురమైన ఈ రేగిఫలాలు ఇష్టం,వీటిలో మంచి పోషకాలు ఉండును, పైగా మన పెరుడులోనే పండును, ఖర్చు తక్కువ ఆరోగ్యం ఎక్కువ"అని నవ్వుతూ మనవరాలు నీరజకి,అచ్చ తెలుగులో స్వచ్ఛమైన సమాధానం ఇచ్చేవాడు తాతయ్య.


            నీరజ ఆపిల్ పండు తింటూ వాటిని కాస్ట్లీ అండ్ హెల్దీ ఫుడ్ అని ముద్దు ముద్దు ఇంగ్లీష్ లో అంటుంటే ఆపిల్ పండ్లు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతుండేవి,అలాగే తాతయ్య రేగిపండుని తింటూ మన పెరడు చెట్టుకి కాస్తున్న మన ఇంటి పండ్లు ఈ రేగిపండ్లు మంచి పోషకాలు కలిగివుంటాయి అని అచ్చ తెలుగులో స్వచ్ఛమైన నవ్వుతో అంటుంటే రేగిపండ్లు మురిసిపోతుండేవి.


               ఒక సెలవు రోజు నీరజ, తాతయ్య ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని పండ్లు తిండి పోటీలు పెట్టుకున్నారు. నీరజ ఆపిల్ పండ్లను పొగుడుతూ తింటుంటే... తాతయ్య రేగుపండ్లని మెచ్చుకుంటూ తింటున్నాడు. "తాతయ్య మనవరాలు మధ్య ఈ తిండి పోటీలేమిటిరాబాబూ....!" అంటూ ఇంటిల్లపాదీ నవ్వుకుంటుండగా...ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నీరజ చిన్నాన్న అప్పుడే ఇంటికి వచ్చాడు, అతన్ని చూసి ఇంట్లో వాళ్ళు అతనికి స్వాగతం పలుకుతూ ముచ్చటలాడుతూ చాలా సమయం గడిపినా నీరజ, తాతయ్యలు మాత్రం వాళ్ళ తిండి పోటీ మూడ్ నుండి బయట పడలేదు, వాదోపవాదాలు ఆపలేదు.


            "నీరజా.. నువ్వుకూడా రేగిపండ్లు తినడానికి తాతయ్యతో పోటీపడుతున్నావా! నేనూ చిన్నప్పుడు మా నాన్న...అదే మీ తాతయ్యతో రేగిపండ్లు తినడానికి పోటీ పడేవాడిని"అని నీరజ చిన్నాన్న నవ్వుతూ నీరజ పక్కన కూర్చొని ఎదురుగా ఉన్న తండ్రి తింటున్న ప్లేట్ నుండి రేగిపండ్లు తీసుకొని తినడం మొదలుపెట్టాడు.


           అంకుల్ గ్రాండ్ ఫా ఈజ్ ఈటింగ్ కంట్రీ ఫ్రూట్స్, ఐ యాం ఈటింగ్ ఆపిల్ యు నో ధీజ్ ఆర్ సిమ్లా ఆపిల్స్ "అని గర్వంగా చెప్పింది నీరజ."సీ మై చైల్డ్ బోథ్ ఆర్ గుడ్ ఫ్రూట్స్, అలాగే నువ్వు తింటున్న పండ్లని తాతయ్య తింటున్న పండ్లని రేగిపండ్లే అంటుంటారు తెలుగులో. కాకపోతే నువ్వు తింటున్నవి సీమ రేగిపండ్లు, తాతయ్య తింటున్నవి నాటు రేగిపండ్లు" అని అన్నాడు నీరజ చిన్నాన్న నవ్వుతూ...


          ఆ మాటలు విని నాటు రేగిపండ్లు సంతోషంతో శివంగిలై సంబరాలు చేసుకున్నాయి, ఆపిల్ పండ్లు ఆశ్చర్యంతో చెవుల పిల్లుల్లా మూతులు ముడుచుకొని బిత్తర చూపులు చూశాయి.


         వెంటనే నీరజ నవ్వుతూ "ఆ విషయం నాకు తెలుసు చిన్నాన్న, తాతయ్య డైరీలో ఎప్పుడూ రాస్తుంటారు 'నీరజకీ సీమరేగిడి పండ్లు ఇష్టం, నాకు నాటు రేగిడి పండ్లు ఇష్టం'అని , నేను చాలా రోజులు క్రితమే తెలుసు కున్నాను ఆపిల్ అంటే తెలుగులో సీమ రేగిడి పండు, అని అంటారని కానీ తాతయ్యని ఆట

పట్టించడానికే నేను ఈ ఫన్ క్రియట్ చేస్తుంటాను" అని అంది. "అమ్మ బడవా...! ఈ తాతయ్యనే ఆట పట్టిస్తావా "అంటూ సున్నితంగా మనవరాలి చెవి మెలిపెట్టాడు తాతయ్య. ఇంట్లో అందరూ హాయిగా నవ్వుకొన్నారు. నీరజ చిన్నాన్న మాత్రం అటు సీమరేగిడి, ఇటు నాటు రెగిడి పండ్లను ఎడా పెడా లాగించేసి సుదూర ప్రయాణము వల్ల ఉన్న ఆకలిని, అలసటను తీర్చుకున్నాడు




      



Rate this content
Log in